Breaking News

నెల రోజుల్లో రూ. 62 వేల కోట్లు ఆవిరి

Published on Sun, 11/02/2025 - 04:43

వాషింగ్టన్‌: అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌తో అగ్రరాజ్యంలో గత నెల రోజుల్లో 7 బిలియన్‌ డాలర్ల మేర (సుమారు రూ. 62,100 కోట్లు) సంపద ఆవిరైపోయింది. కాంగ్రెషనల్‌ బడ్జెట్‌ ఆఫీస్‌ (సీబీవో) అంచనాల ప్రకారం ఈ గణాంకాలు అక్టోబర్‌ 1న షట్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి నాలుగు వారాలకు సంబంధించినవి. కాగా ఇదే తీరు కొనసాగితే ఆరు వారాలకు 11 బిలియన్‌ డాలర్లు, ఎనిమిది వారాలకు 14 బిలియన్‌ డాలర్ల మేర ఆర్థిక నష్టం ఏర్పడవచ్చని సీబీవో అంచనా వేసింది. పది లక్షల మంది పైగా ఉద్యోగులకు జీతభత్యాలు లేకపోవడం వల్ల షట్‌డౌన్‌ సమయంలో వస్తువులు, సరీ్వసుల కొనుగోళ్లు పడిపోతాయని పేర్కొంది.

షట్‌డౌన్‌ ఎత్తివేత అనంతరం స్థూల దేశీయోత్పత్తి నెమ్మదిగా తిరిగి కోలుకున్నా, నష్టపోయిన సంపద మాత్రం ఇక రికవర్‌ కాదని పేర్కొంది. కీలకమైన బిల్లులకు సంబంధించి అధికార, విపక్ష చట్టసభ సభ్యుల మధ్య రాజీ కుదరకపోవడంతో అమెరికా ప్రభుత్వం మూతబడింది. ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. 1976 నుంచి దాదాపు 10 సార్లు షట్‌డౌన్‌ పరిస్థితి ఎదురైంది. 2018 డిసెంబర్‌ 22 నుంచి 2019 జనవరి 25 వరకు 35 రోజుల పాటు సాగిన షట్‌డౌన్‌ అమెరికా చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైనది. అప్పుడు కూడా డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉండటం గమనార్హం. ప్రభుత్వం మూతబడినప్పుడు, నిధులు లేకపోవడం వల్ల, కొన్ని ముఖ్యమైన విభాగాలు తప్ప, కీలకం కాని ఫెడరల్‌ సర్వీసులన్నీ నిలిచిపోతాయి.  

#

Tags : 1

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)