Breaking News

Kamala Harris: పోరులో వెనకబడ్డా.. పోరాటం ఆపబోను

Published on Fri, 11/08/2024 - 04:42

వాషింగ్టన్‌: విజయతీరాలకు కాస్తంత దూరంలో నిలిచిపోయినా పోరాటం మాత్రం ఆపేదిలేదని డెమొక్రటిక్‌ నాయకురాలు కమలా హారిస్‌ వ్యాఖ్యానించారు. హోరాహోరీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ చేతిలో పరాజయం పాలైన హారిస్‌ ఫలితాల తర్వాత తొలిసారిగా స్పందించారు. గురువారం వాషింగ్టన్‌లోని హొవార్డ్‌ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వేలాది మంది పార్టీ మద్దతుదారుల సమక్షంలో ఆమె భావోద్వేగ ప్రసంగం చేశారు. 60 ఏళ్ల హారిస్‌ గతంలో ఇదే వర్సిటీలో రాజనీతి, ఆర్థికశాస్త్రం చదువుకున్నారు.

నా హృదయం నిండిపోయింది
‘‘దేశంపై ప్రేమతో, దేశం కోసం పాటుపడుతూ మీరంతా నాపై ఉంచిన నమ్మకం, ప్రేమతో ఈ రోజు నా హృదయం నిండిపోయింది. ఈ ఎన్నికల్లో మనం ఆశించిన ఫలితం దక్కలేదు. నిజానికి ఇలాంటి ఫలితం కోసం మనం పోరాడలేదు. మీరంతా ఓటేసింది కూడా ఇలాంటి ఫలితం కోసం కాదు. అయితే ఒక్కటి మాత్రం నిజం. అమెరికా అభ్యున్నతి కోసం మనందరం చేసిన ప్రతిజ్ఞా జ్వాల ఎప్పటికీ మండుతూనే ఉంటుంది. ఓడిపోయాక పార్టీ అశేష అభిమానుల్లో పెల్లుబికి వస్తున్న భావోద్వేగాలను అర్థంచేసుకోగలను. అయినాసరే ఈ ఫలితాలను అంగీకరించక తప్పదు. ఫలితం ఎలా ఉన్నా ఆమోదించడం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రం. నేను ఈ ఫలితాలను, ఓటమిని అంగీకరిస్తున్నా. అయితే పోరాటాన్ని మాత్రం ఆపబోను’’ అని అన్నారు. 

ట్రంప్‌ను విష్‌ చేశా
గత ఎన్నికల్లో ఓడినాసరే ఓటమిని అంగీకరించకుండా ట్రంప్‌ ప్రభుత్వం సాఫీగా అధికార మార్పిడి జరక్కుండా అడ్డుకున్న అంశాన్ని హారిస్‌ ప్రస్తావించారు. ‘‘ అధ్యక్ష్య ఎన్నికల్లో రెండోసారి గెలిచిన ట్రంప్‌కు స్వయంగా ఫోన్‌ చేసి శుభాకాంక్షలు చెప్పా. కాలపరిమితి ముగిశాక శాంతియుతంగా అధికార మార్పిడికి మా ప్రభుత్వం సాయపడుతుందని హామీ ఇచ్చా. మన దేశంలో ఒక అధ్యక్షుడికో, రాజకీయ పార్టీకో నిబద్దులై ఉండాల్సిన పనిలేదు. కానీ దేశ రాజ్యాంగానికి ఖచ్చితంగా మనం బద్ధులమై ఉండాలి. ఎన్నికలు ముగియడంతో మన పోరాటం ముగిసిపోలేదు. మన పోరాటం కొనసాగుతుంది.

 అగ్రరాజ్య ఆవిర్భావానికి పునాదులైన సూత్రాలకు కట్టుబడి ఉందాం. కొన్నిసార్లు పోరాటం అనేది సుదీర్ఘకాలం కొనసాగొచ్చు. అంతమాత్రాన మనం గెలవబోమని కాదు. గెలిచేదాకా పోరాటం ఆపకపోవడమే ఇక్కడ ముఖ్యం. స్వేచ్ఛా, అవకాశాలు, పారదర్శకత, ప్రజలకు మెరుగైన జీవితం అందించేదాకా మన పోరాటం కొనసాగుతుంది. ప్రజాస్వామ్యం, శాంతి, సమానత్వం, న్యాయం కోసం నా పోరు ఆగదు. స్వేచ్ఛ కోసం జరిపే సమరం చాలా శ్రమతో కూడుకొని ఉంటుంది. ఇలాంటి కష్టాన్ని మనం ఇష్టపడతాం. మన దేశం కోసం ఆమాత్రం కష్టపడటం సబబే. ఫలితాల తర్వాత మనం ఓటమి చీకట్లోకి జారుకుంటున్నామని చాలా మంది భావించి ఉండొచ్చు. కానీ ఈ కష్టకాలం పెద్ద విషయమే కాదు’’ అని అన్నారు.

సభలో గంభీర వాతావరణం
పార్టీ ఓటమితో డెమొక్రాట్లలో ఒకింత నైరాశ్యం నిండింది. సభకు వేలాది మంది వచ్చినా సరే కొన్ని నిమిషాలు నిశ్శబ్దం రాజ్యమేలింది. మధ్యమధ్యలో హారిస్‌ తన ఉత్సాహభరితమైన ప్రసంగంతో వాళ్లలో హుషారు నింపే ప్రయత్నంచేశారు. పార్టీ సీనియర్‌ నేతలు కొందరు ప్రసంగించారు. దిగువసభ మాజీ మహిళా స్పీకర్‌ నాన్సీ పెలోసీ, డీసీ మేయర్‌ మురేల్‌ బౌసర్‌ తదితరులు మాట్లాడారు. పార్టీ గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్న కొందరు యువ ఓటర్లు, మద్దతుదారులు సభలోనే కన్నీటిపర్యంతమయ్యారు.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)