Breaking News

ట్రంప్‌ అధ్యక్షుడైతే.. మరి కేసుల సంగతి!

Published on Wed, 11/06/2024 - 21:36

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జయకేతనం ఎగరవేసిన డొనాల్డ్‌ ట్రంప్‌.. రెండోసారి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అయితే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత.. ఈ నాలుగేళ్ల కాలంలో ఆయనపై అనేక ఆరోపణలు, అభియోగాలు నమోదయ్యాయి. ఓ కేసులో కోర్టు బయటే అరెస్ట్‌ కాగా.. మరో కేసులో కోర్టు దోషిగా తేల్చేసింది కూడా. మరి ఇప్పుడు ఆయన మరోసారి ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా మరోసారి వైట్‌హౌజ్‌లో అడుగుపెట్టబోతున్న ఆయనకు.. ఈ కేసులు తలనొప్పి తెచ్చి పెట్టే అవకాశం లేకపోలేదా?.

ఓ మాజీ శృంగార తారతో అనైతిక ఒప్పందం కుదుర్చుకున్న హష్‌ మనీ కేసులో ట్రంప్‌ దోషిగా తేలారు. ఈ కేసుకు సంబంధించి న్యూయార్క్‌లోని న్యాయస్థానం నవంబర్‌ 26న శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తరుణంలో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే, ఈ కేసును వాయిదా వేయాలని ట్రంప్‌ తరఫు న్యాయవాదులు న్యాయమూర్తిని కోరే అవకాశం లేకపోలేదు. ఇక.. వాషింగ్టన్‌ డీసీ, ఫ్లోరిడాల్లో నమోదైన రెండు క్రిమినల్‌ కేసులు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే, వీటిని కూడా విచారణ వాయిదా వేయించాలని ట్రంప్‌ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎందుకంటే.. స్పెషల్‌ కౌన్సిల్ జాక్‌ స్మిత్ ట్రంప్‌కు ఏమాత్రం అనుకూలంగా లేరు. దీంతో విచారణ వాయిదా గ్యాప్‌ దొరికితే.. ఆయన‌పై వేటు వేసేందుకు అవకాశం దొరుకుతుంది. ఈ విషయాలు ఎవరో నిపుణులు చెప్పినవి కావు.. స్వయానా డొనాల్డ్‌ ట్రంప్‌ పలుఇంటర్వ్యూల్లో బహిరంగంగానే చెప్పడం గమనార్హం. అంటే.. అధ్యక్ష పదవి చేపట్టాక ట్రంప్‌ తన సొంత ‘న్యాయ’ వ్యవస్థతో తనను తాను నిర్దోషిగా మార్చుకునే అవకాశం ఉందన్నమాట!.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)