అమెరికా ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్‌

Published on Tue, 11/05/2024 - 18:54

న్యూయార్క్‌: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లలో నిల్చున్నారు.‌ ఇక.. పోలింగ్‌ పాల్గొని ఓటు వేయాలని డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా పౌరులకు విజ్ఞప్తి చేశారు. 

బ్యాలెట్‌ పేపర్‌ విధానంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. హ్యాండ్‌మార్క్‌డ్‌ పేపర్‌ బ్యాలెట్స్‌ ద్వారా కొందరు, బ్యాలెట్‌ మార్కింగ్‌ డివైజ్(BMD)‌లతో కూడిన పేపర్‌బ్యాలెట్‌తో మరికొందరు ఓటేసే ఛాన్స్ ఇచ్చారు.‌ బీఎండీ డిజిటల్‌ బ్యాలెట్‌.. ఓటేసి అప్పటికప్పుడే ప్రింట్‌ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈవీఎంల తరహా డైరెక్ట్‌ రికార్డింగ్‌ ఎలక్ట్రానిక్‌(DRE) ద్వారా కేవలం ఐదు శాతం ఓటేసే ఛాన్స్  ఉంది.‌ హ్యాకింగ్‌ ఆరోపణలు, ట్యాంపరింగ్‌ అనుమానాల నేపథ్యంలోనే డీఆర్‌ఈలకు అమెరికా ఓటర్లు దూరంగా ఉన్నారు.

ఇక.. గత ఎన్నికల్లో కేవలం 66 శాతమే  పోలింగ్‌ నమోదైంది. ఈసారి ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు నిలబడ్డారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇద్దరి మధ్యే  పోటీ నెలకొంది. ట్రంప్‌-హారిస్‌ మధ్య పోటీతో అమెరికన్ల తీర్పు ఎలా ఉండనుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. కనెక్టికట్‌, ఇండియానా, కెంటకీ, న్యూజెర్సీ, మెయినే, న్యూహాంప్సైర్‌, న్యూయార్క్‌  వర్జీనీయాలో  పోలింగ్‌ కొనసాగుతోంది. పోలింగ్‌ అయిన వెంటనే  కౌంటింగ్‌ ప్రారంభం కానుంది.ఇక.. రేపు సాయంత్రం లేదంటే ఎల్లుండి కల్లా ఫలితంపై  స్పష్టత రానుంది.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)