Breaking News

ట్రంప్‌ ఆంక్షలతో అమెరికా విద్యారంగం విలవిల

Published on Thu, 10/02/2025 - 06:03

సాక్షి, అమరావతి: అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికాలో విద్యాసంస్థలను ఆర్థిక సంక్షోభం వణికిస్తోంది. విదేశీ విద్యార్థుల చేరికల్లో క్షీణత యూఎస్‌లోని కళా­శాలల మూసివేతకు దారితీస్తోంది. 2025–26 వి­ద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో యూఎ­స్‌­లోని మిడ్‌ టైర్‌ కళాశాలల పరిస్థితి దయనీయంగా మా­రుతోంది. తక్కువ లాభాలతో నడుస్తున్న సంస్థ­ల్లో విద్యార్థుల చేరికల్లో తగ్గుదల, ఆదాయం తగ్గిపోవ­డం, పెరుగుతున్న ఖర్చులను ఎదుర్కోలేక తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారితీస్తోంది. అక్కడి కళాశాలల దీర్ఘకాలిక మనుగడకు ముప్పుగా పరిణమించింది. 

వీసా నిబంధనల్లో మార్పులు 
కొత్త వీసా పరిమితుల కారణంగా యూఎస్‌ మిడ్‌ టైర్‌ కళాశాలల్లో విద్యార్థుల చేరికలు క్షీణించి.. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య తగ్గడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. ముఖ్యంగా ట్యూషన్‌ ఆధారిత సంస్థలకు మూసివేత ప్రమాదం పెరుగుతోంది. ఎలైట్‌ విశ్వవిద్యాలయాలు స్థిరంగా ఉన్నప్పటికీ చిన్న సంస్థలు మాత్రం మనుగడ కోసంసిబ్బందితోపాటు ఇతర కార్యక్రమాలనూ తగ్గించుకుంటున్నాయి. 

సీఎన్‌బీసీ సూచించిన ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఫిలడెల్ఫియా పరిశోధన ప్రకారం.. అమెరికా ఉన్నత విద్యారంగంలో మూసివేతలు, విలీనాలు త్వరలో సంభవించే మాంద్యంతో వేగవంతం అవుతున్నట్టు అమెరికన్‌ కౌన్సిల్‌ ఆన్‌ ఎడ్యుకేషన్‌ అధ్యక్షుడు టెడ్‌ మిచెట్‌ ప్రకటించడం గమనార్హం. 

లక్షన్నర విద్యార్థుల తగ్గుదల 
అమెరికా కళాశాలల్లో స్థానికంగా చేరికలు తగ్గడంతో పాటు అంతర్జాతీయ విద్యార్థుల రాక ఆగిపోవడంతో సమస్య మరింత తీవ్రం అవుతోంది. అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేటర్స్‌ అంచనా ప్రకారం 2025–26 విద్యా సంవత్సరంలో అంతర్జాతీయ విద్యార్థుల నమోదులో ఏకంగా 1.50 లక్షల వరకు తగ్గుదల ఏర్పడనుంది. 

ఇది కొత్త అంతర్జాతీయ విద్యార్థుల చేరికల్లో 30–40 శాతం కాగా.. మొత్తం విద్యార్థులపై 15 శాతం తగ్గుదలను సూచిస్తోంది. ఈ ఫలితాల ప్రకారం అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏడాదికి రూ.58 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని నివేదిక పేర్కొంది. ఈ ఒత్తిళ్ల ఫలితంగా కొన్ని సంస్థలు మనుగడ సాగించలేని ఆర్థిక వాతావరణం ఏర్పడుతోంది.  

ఇది ట్రంప్‌ ఆంక్షల ఎఫెక్టే 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరిపాలన విధాన మార్పులే యూఎస్‌ విద్యాసంస్థల సంక్షోభానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. వాస్తవానికి అమెరికన్‌ సంస్థలకు అంతర్జాతీయ విద్యార్థులు చాలాకాలంగా కీలకమైన ఆర్థిక స్తంభంగా నిలుస్తున్నారు. ఈ విద్యార్థులు పూర్తి ట్యూషన్‌ ఫీజులు చెల్లిండంతో పాటు జీవన వ్యయాల ద్వారా ఆదాయాన్ని సమకూరుస్తున్నారు. 2024–25లో అంతర్జాతీయ విద్యార్థుల ద్వారా అమెరికాకు ఏటా రూ.4.09 లక్షల కోట్లను అమెరికా ఆర్థిక వ్యవస్థకు అందించారు. 

వాస్తవానికి పూర్తిగా ట్యూషన్‌ ఫీజులు చెల్లించే అంతర్జాతీయ విద్యార్థులు దేశీయ విద్యార్థులకు స్కాలర్‌íÙప్‌లను అందించేందుకు పరోక్షంగా దోహదపడుతున్నారు. ఇది ఒకరితో ఒకరికి ముడి ఉన్న సంబంధం. అంతర్జాతీయ విద్యార్థులు తగ్గితే ఆదాయం క్షీణించడంతో పాటు స్థానిక విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే సంస్థల సామర్థ్యం పతనం అవడం ఖాయంగా కనిపిస్తోంది.  

ట్యూషన్‌ ఫీజులపైనే ఆధారం
అమెరికాలోని ఉన్నత విద్యారంగం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అనేక విద్యాసంస్థలు ఆయా రాష్ట్రాలు విధించిన పరిమితుల కారణంగా ట్యూషన్‌ ఫీజులు పెంచుకోలేకపోతున్నాయి. ఇదే సందర్భంలో ఖర్చులు ఏమాత్రం తగ్గడం లేదు. కేవలం ట్యూషన్‌ ఫీజులపై ఆధారపడి నడిచే కళాశాలలు కోల్పోయిన ఆదాయాన్ని భర్తీ చేయడానికి నానాతంటాలు పడుతున్నాయి. దానాల ద్వారా వచ్చే నిధులు కలిగిన ఎలైట్‌ విద్యాసంస్థలకు తక్కువ ప్రమాదం ఉంది. 

రాష్ట్రాల మద్దతుతో నడిచే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మధ్యస్థంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా, చిన్న, మధ్యస్థాయి ట్యూషన్‌ ఫీజుల ఆధారిత కళాశాలలు మాత్రం కునారిల్లుతున్నాయి. హార్వర్డ్, కొలంబియా, న్యూయార్క్‌ వర్సిటీ వంటి అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు పెద్ద చార్జీల నిధులు, స్థిరమైన అంతర్జాతీయ డిమాండ్‌ కారణంగా బాగా­నే ఉన్నాయి. కానీ.. చిన్న సంస్థలు తమ కార్యకలాపాలను తగ్గించుకుంటున్నాయి. క్యాంపస్‌ అప్‌గ్రేడ్‌ వాయిదా, సిబ్బంది సంఖ్యను తగ్గించుకుంటూ నిధులను ఆదా చేసుకుంటున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)