Breaking News

కాళ్లలో మొత్తం పరాన్నజీవులే

Published on Sun, 09/01/2024 - 05:58

వాషింగ్టన్‌: కాళ్ల నుంచి నడుము దాకా నొప్పితో బాధపడు తూ ఆస్పత్రిలో చేరిన రోగికి సిటీ స్కాన్‌ చేసి ఆ రిపోర్ట్‌ చూశాక అవాక్కవడం వైద్యుల వంతయింది. అమెరికాలో ని యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడా హెల్త్‌ జాక్సన్‌విల్లే వైద్యకళా శాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పలు అంశాలపై ప్రజలకు ఆన్‌లైన్‌లో అవగాహన కల్పించే ఒక వైద్యుడి ద్వారా ఈ విషయం వెల్లడైంది. 

రోగికి తీసిన సీటీ స్కాన్‌ రిపోర్ట్‌లను చూపిస్తూ పరాన్న జీవులతో ఇబ్బందిపడ్డ ఆ రోగి వివరాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా డాక్టర్‌ శామ్‌ ఘలీ వెల్లడించారు. ‘‘అత్యవసర చికిత్స నిమిత్తం ఆగస్ట్‌ 25వ తేదీన ఆ రోగిని మా ఎమర్జెన్సీ రూమ్‌లో చేర్పించారు. వెంటనే నేను సీటీ స్కాన్‌ తీ యించా. ఆ సీటీ స్కాన్‌ రిపోర్ట్‌చూశాక నాకు నోట మా టరాలేదు. కాళ్లలో ఎక్కడపడితే అక్కడ పరాన్నజీవులు తిష్టవే శాయి. సరిగా ఉడకని పంది మాంసం తినడం వల్ల రోగి శరీరంలోకి పంది నులిపురుగులు ప్రవేశించి రెండు కాళ్ల కండరాలను మొత్తం ఆక్రమించేశాయి. ఈ విషమ పరిస్థితిని టేనియా సోలియం లేదా సిస్టీసెర్కోసిస్‌గా వ్యవహరిస్తారు. 

ఏమిటీ సిస్టీసెర్కోసిస్‌?
సరిగా ఉడకని, పచ్చి పంది మాసం తినడం వల్ల ఆ మాంసంలోని నులిపురుగులు మానవ శరీరంలోకి ప్రవేశిస్తాయి. దాని లార్వాలు మెదడు, కండరాల్లో కి చొరబడితే ఆరోగ్య పరిస్థితి మరింత దారుణంగా తయార వుతుంది. చర్మం కింద గడ్డలు, తలనొప్పితోపాటు ఇన్ఫెక్షన్‌ మెదడు, వెన్నుపూస దాకా చేరితే మూర్ఛ వ్యాధి రావొచ్చు. కలుషిత ఆహారం, కలుషిత నీరు, అశుభ్రమైన చేతులు, మనిషి మలం ద్వారా కూడా ఈ నులిపురుగులు వ్యాపి స్తాయి. ఉడికీఉడకని పంది మాంసం ద్వారా లార్వాలు మనిషి పేగుల్లోకి, అక్కడి నుంచి రక్తంలో కలుస్తాయి. రక్తంతోపాటు శరీరమంతా తిరుగుతూ ఎక్కడపడితే అక్కడ లార్వాలు తిష్టవేస్తాయి.

 తొలి దశలోనే సిస్టీ సెర్కోసిస్‌ను గుర్తిస్తే నివారణ చాలా సులభం. ఆల స్యం చేస్తే మాత్రం మరణం ఖాయం. ప్రపంచవ్యాప్తంగా ఏటా 5 కోట్ల మంది ఈ వ్యాధి బారినపడుతు న్నారు. అయితే కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వ్యాధి ముదిరి ఏటా 50,000 మంది చనిపో తున్నారు. ‘‘యాంటీ–పారాసైట్‌ థెరపీ, స్టెరాయిడ్‌ లు, న్యూరోసిస్టీసెర్కోసిస్‌ కోసం యాంటీ–ఎపిలె ప్టిక్స్, సర్జరీ ద్వారా ఈ వ్యాధికి చికిత్స చేసుకోవచ్చు. తొలి దశలో సీటీ స్కాన్‌ చేయిస్తే స్కానింగ్‌లో తెల్ల బియ్యంలాగా ఇవి కనిపిస్తాయి. దాంతో వీటిని గుర్తించవచ్చు. ఇన్ఫెక్షన్‌ సోకిన 5–12 వారాల్లోగా అవి నులిపురుగులుగా మారతాయి. అప్పుడు సమస్య మరింత జఠిలమవుతుంది. అందుకే తినేటప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోండి’. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)