Breaking News

వలసదారుల విమానాల ఖర్చు  మిలియన్‌ డాలర్లు! 

Published on Sat, 02/08/2025 - 06:44

వాషింగ్టన్‌: అధికారంలోకి వస్తే అమెరికా చరిత్రలోనే లేనంతటి భారీ ఆపరేషన్‌తో వలసదారులను వెనక్కి పంపిస్తామంటూ ఇచ్చిన హామీ అమలుకు ట్రంప్‌ సర్కారుకు భారీగానే చేతి చమురు వదులుతోంది. ఈ నెల 5న అమెరికా నుంచి అమృత్‌సర్‌కు 104 మంది అక్రమ వలసదారులతో చేరుకున్న అమెరికా వైమానిక దళ భారీ విమానం సీ–17ఏ గ్లోబ్‌మాస్టర్‌ 3 ప్రయాణ ఖర్చు చూస్తే ఎవరైనా నోరు వెళ్లబెట్టాల్సిందే.

 అమెరికా తమ దేశంలోని వలసదారులను సైనిక విమానంలో పంపడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అమెరికా ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) విభాగం అంచనాల ప్రకారం..వలసదారుల కోసం వాడే చార్టర్‌ విమానం ప్రతి గంట ప్రయాణానికి 8,577 డాలర్ల ఖర్చవుతుంది. ప్రమాదకరమైన వలసదారుల కోసమైతే ఈ ఖర్చు మరికాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే, బలగాలు, వాహనాలు, ఇతర సరఫరాల రవాణా కోసం గ్లోబ్‌ మాస్టర్‌ను 1995 నుంచి అమెరికా ఎయిర్‌ ఫోర్స్‌ వినియోగిస్తోంది. 

ఈ భారీ విమానం ఖర్చు ఏకంగా గంటకు 28,562 డాలర్ల వరకు ఉంటుందని అమెరికా ఎయిర్‌ మొబిలిటీ కమాండ్‌ గణాంకాలు చెబుతున్నాయి. సాధారణ చార్టర్‌ విమానం ఖర్చుకు ఇది మూడు రెట్లు ఎక్కువ. ఎందుకంటే, ఇతర విమానాల మాదిరిగా కాకుండా ఇంధన కోసం మిలటరీ ఎయిర్‌ బేస్‌ల వద్దే ల్యాండవుతుంది. సైనిక విమానం అయినందున ప్రయాణం కూడా ఇతర దేశాల గగనతలంలో చేసే ప్రయా ణంతో పొలిస్తే వేరుగా ఉంటుంది. ఫ్లయిట్‌రాడార్‌ 24 రికార్డు ప్రకారం ఈ విమానం సోమవారం కాలిఫోర్నియాలోని శాన్‌డియాగో మెరైన్‌ కార్ప్స్‌ ఎయిర్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరింది. 

హవాయికి వెళి పసిఫిక్‌ మహా సముద్రం మీదుగా ఫిలిప్పీన్స్‌ పమీపంలోని లుజాన్‌కు చేరుకుంది. అటు నుంచి ఇండోనేసియా, మలేసియాల మీదుగా హిందూ మహాసముద్రంలోని డీగో గార్సియా ఎయిర్‌ బేస్‌కు చేరుకుంది. అటు నుంచి ఇండియాలో ప్రవేశించింది. మొత్తంగా 43 గంటల ప్రయాణానికి గాను కనీసం 10 లక్షల డాలర్లు అంటే సుమారు రూ.8.78 కోట్ల వరకు ఖర్చయినట్లు లెక్కలేస్తున్నారు. అంటే ఒక్కో వలసదారుడికి 10వేల డాలర్ల వరకు అంటే రూ.8.78 లక్షల సొమ్మును ట్రంప్‌ ప్రభుత్వం వెచ్చించినట్లవుతోంది. సాధారణ ఎయిర్‌లైన్స్‌ విమానంలో శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి న్యూఢిల్లీ టిక్కెట్‌ ఖరీదు కనిష్టంగా వెయ్యి డాలర్లు, బిజినెస్‌ క్లాస్‌ౖకైతే నాలుగు వేల డాలర్లు కావడం విశేషం.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)