Breaking News

అమెరికాకు తప్పిన షట్‌డౌన్‌ ముప్పు

Published on Mon, 10/02/2023 - 06:24

వాషింగ్టన్‌: అమెరికాకు షట్‌డౌన్‌ ముప్పు తాత్కాలికంగా తప్పింది. వార్షిక ద్రవ్య వినిమయ బిల్లుని ఆమోదించడానికి ప్రతిపక్ష రిపబ్లికన్లు ససేమిరా అనడంతో  బిల్లులు చెల్లించలేక అగ్రరాజ్యం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదరకర పరిస్థితులు వచ్చాయి. అయితే శనివారం రాత్రి చివరి క్షణంలో స్వల్పకాలిక బిల్లుకి రిపబ్లికన్లు ప్రతినిధుల సభలో ఆమోదించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చివరి క్షణంలో తాత్కాలిక నిధుల విడుదల బిల్లుపై సంతకాలు చేశారు.

దీంతో దేశంలో వివిధ పథకాలు, సైనికులు, ప్రభుత్వ జీత భద్రతాలకు మరో 45 రోజులు ఢోకా లేదు. ఈ బిల్లు నుంచి ఉక్రెయిన్‌కు అందించే ఆర్థిక సాయాన్ని మినహాయించారు. అమెరికాలో కొత్త ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్‌ 30 అర్ధరాత్రి 12 గంటల్లోగా  ద్రవ్యవినిమయ బిల్లుల్ని ఆమోదించాల్సి ఉంది.

అయితే  ప్రతినిధుల సభలో మెజార్టీ కలిగిన రిపబ్లికన్లు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుల్ని ఆమోదించడానికి నిరాకరించారు.  ప్రతినిధుల సభ స్పీకర్‌ మెకార్థీ రిపబ్లికన్‌ పార్టీకి చెందినవారే అయినప్పటికీ ద్రవ్య బిల్లుల్ని అడ్డుకుంటే ప్రజలకి ఇబ్బందులకు గురవుతారని నచ్చజెప్పడంతో వారు ఒక్క మెట్టు దిగారు.  స్పీకర్‌ ప్రతిపాదించిన స్వల్పకాలిక బిల్లుకు ఆమోదం తెలిపారు. దీంతో అమెరికాలో ఫెడరల్‌ ప్రభుత్వానికి ఉపశమనం         లభించింది. 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు