Breaking News

యుఎస్ క్యాపిటల్ హిల్స్ పై అటాక్ ప్లాన్.. కుట్రభగ్నం

Published on Wed, 02/18/2026 - 07:17

అమెరికా  భద్రతా సిబ్బంది అప్రమత్తతతో  పెను ప్రమాదం తప్పింది. ఒక దుండగుడు తుపాకీతో యుఎస్ క్యాపిటల్ హిల్స్ భవనం వైపు పరుగెత్తుతుండగా అక్కడే ఉన్న క్యాపిటల్ హిల్స్ భద్రత బలగాలు ఆయనను అదుపులోకి తీసుకున్నాయి. ఇటీవలే అక్కడి శ్వేతసౌధం వద్ద భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిగిన ఘటన మరవక ముందే ఈ ఘటన జరగడం అక్కడ కలకలం రేపింది.

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో గన్ కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గన్ లైసెన్స్ సులువుగా లభిస్తుండడంతో విచ్చలవిడిగా తుపాకులు పెరిగిపోతుంటాయి. అందుకే అక్కడ తరచుగా కాల్పుల ఘటనలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల అక్కడ శ్వేతసౌధం పై  దాడి జరిగింది. అక్కడి వైట్ హైస్  దగ్గర ఇటీవలే ఓ గుర్తు తెలియన వ్యక్తి కాల్పులు జరుపగా ఒక సెక్యూరిటీ సిబ్బంది మృతిచెందారు. మరోకరు గాయపడ్డారు. ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు మరోసారి క్యాపిటల్ హిల్ పై దాడిని అక్కడి పోలీసులు అడ్డుకున్నారు.

భద్రతా సిబ్బంది కథనం ప్రకారం.. "యూఎస్ క్యాపిటల్ హిల్స్ కు దగ్గరగా ఒక వ్యక్తి SUV వెహికల్ ఆపారు. ముఖానికి గ్లౌస్ ధరించి, హెల్మెట్ పెట్టుకొని, చేతిలో గన్ పట్టుకొని పరిగెత్తుతూ క్యాపిటల్ హిల్స్ వైపు దూసుకొస్తున్నారు. ఇంతలో మేము అతనని అడ్డుకున్నాం గన్ పడేయాలని కోరాం" అని అన్నారు. అనంతరం అతని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే ఆ గన్ లో బుల్లెట్స్  ఫుల్ గా లోడ్ చేసి ఉన్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహారించడంతో దాడి ప్రయత్నం విఫలమైందని పేర్కొన్నారు. అయితే వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు యుఎస్ క్యాపిటల్ హౌస్ లో ప్రసంగం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)