Breaking News

నోబెల్‌ గ్రహీత వీసా రద్దు

Published on Fri, 04/04/2025 - 01:14

శాన్‌జోస్‌: నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, కోస్టారికా మాజీ అధ్యక్షుడు ఆస్కార్‌ అరియాస్‌ (84) వీసాను అమెరికా రద్దు చేసింది. దీనిపై అరియాస్‌ ఆశ్చర్యం వెలిబుచ్చారు. రద్దుకు కారణమేమిటో తనకు తెలియదని కోస్టారికా రాజధాని శాన్‌ జోస్‌లో మీడియాతో అన్నారు. ‘‘వీసా రద్దు చేస్తున్నట్టు అమెరికా అధికారులు మెయిల్‌ పంపారు. కానీ ఈ విషయమై ఎలాంటి వివరణా ఇవ్వలేదు’’అని చెప్పారు. 

‘‘అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీరును రోమన్‌ చక్రవర్తితో పోలుస్తూ నేను బహిరంగ విమర్శలు చేశా. నేను అధ్యక్షుడిగా ఉండగా చైనాతో కోస్టారికా దౌత్య బంధాన్ని పునరుద్ధరించా. బహుశా ఇవన్నీ కారణమై ఉంటాయి’’అని అభిప్రాయపడ్డారు. సెంట్రల్‌ అమెరికాలో ఘర్షణల నివారణకు చేసిన కృషికి అరియాస్‌కు 1987లో నోబెల్‌ శాంతి బహుమతి దక్కింది. ఆయన 1986–1990, 2006–2010 మధ్య ఎనిమిదేళ్లు కోస్టారికా అధ్యక్షుడిగా ఉన్నారు. రెండో పదవీకాలంలో అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ప్రోత్సహించారు. 2007లో తైవాన్‌కు దూరమై చైనాతో దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నారు. 

కోస్టారికా అధ్యక్షుడు రోడ్రిగో చావెజ్‌ అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి దేశంలో 5జీ సదుపాయాల అభివృద్ధి పనుల నుంచి చైనా సంస్థలను పక్కన పెట్టారు. దీన్ని వ్యతిరేకించిన ముగ్గురు కోస్టారిక చట్టసభ సభ్యుల వీసాలను అమెరికా రద్దు చేసింది. ఈ పరిణామాలపై అరియాస్‌ మండిపడ్డారు. అమెరికా ఒత్తిడికి రోడ్రిగో లొంగుతున్నారని సోషల్‌ మీడియా వేదికగా దుయ్యబట్టారు. ‘‘ఒక చిన్న దేశం అమెరికాతో విభేదించడం సులువు కాదు. అందులోనూ అమెరికా అధ్యక్షుడు రోమన్‌ చక్రవర్తిలా ప్రవర్తిస్తూ మిగతా ప్రపంచానికి ఏం చేయాలో, ఏం చేయొద్దో పొద్దస్తమానం చెబుతున్నప్పుడు మరింత కష్టం’’అంటూ ఎద్దేవా చేశారు. కోస్టారికాకు చెందిన మరో ప్రతిపక్ష శాసనసభ్యురాలి వీసాను కూడా అమెరికా మంగళవారం రద్దు చేసింది.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)