Breaking News

యెమెన్‌ పోర్టుపై మళ్లీ అమెరికా దాడులు

Published on Mon, 04/21/2025 - 05:38

సనా: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదార్ల మౌలిక వనరులే లక్ష్యంగా అమెరికా మరోసారి భీకర దాడులకు పాల్పడింది. హొడైడా నౌకాశ్రయం, విమానా శ్రయాలపై ఆదివారం 13 సార్లు అమెరికా వైమానిక దాడులు జరిపిందని హౌతీల అధీనంలో అల్‌ మసీరాహ్‌ టీవీ చానెల్‌ పేర్కొంది. హొడైడా ప్రావిన్స్‌లోనే ఉన్న రాస్‌ ఇసా పోర్టుపై అమెరికా రెండు రోజుల క్రితం చేపట్టిన దాడుల్లో 80 మంది మృతి చెందారు. 150 మందికి గాయాలయ్యాయి. 

అమెరికా బలగాలు శనివారం రాజధాని సనాలోని రెండు ప్రాంతాలపై జరిపిన దాడుల్లో ముగ్గురు చనిపోగా నలుగురు గాయపడినట్లు అల్‌ మసీరాహ్‌ తెలిపింది. అమెరికా ఎన్ని దాడులు చేసినా తాము వెనక్కి తగ్గేది లేదని హౌతీలు ప్రకటించారు. గాజాలోని పాలస్తీనియన్లకు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ వాణిజ్యానికి ఎంతో కీలకమైన ఎర్ర సముద్రంలో ప్రయాణించే పశ్చిమదేశాల నౌకలపై హౌతీలు ఇప్పటివరకు 100కు పైగా దాడులు జరిపారు. దీంతో, హౌతీల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజా దాడులకు శ్రీకారం చుట్టారు. 

ఈ దాడులపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాస్‌ ఇసా పోర్టుపై దాడి ఫలితంగా దెబ్బతిన్న ట్యాంక్‌ల నుంచి లీకైన చమురు ఎర్ర సముద్ర జలాలను కలుషితంగా మార్చే ప్రమాదముందన్నారు. ఈ దాడిలో ఐదుగురు ఐరాస సహాయక సిబ్బంది సైతం గాయపడ్డారన్నారు. యెమెన్‌ దిగుమతుల్లో 70 శాతం, మానవతాసాయంలో 80 శాతం రాస్‌ ఇసా, హొడైడా, అస్‌ సలీఫ్‌ పోర్టుల ద్వారానే జరుగుతుంటాయి. రాస్‌ ఇసాలో యెమెన్‌ ప్రధాన ఆయిల్‌ పైప్‌ లైన్‌కు టెర్మినస్‌తోపాటు, అత్యంత కీలక మౌలిక వనరులున్నాయని ఐరాస పేర్కొంది. 
 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)