Breaking News

యెమెన్‌ నౌకాశ్రయంపై  అమెరికా భీకరదాడులు

Published on Sat, 04/19/2025 - 06:07

దుబాయ్‌: యెమెన్‌లోని హౌతీ రెబల్స్‌ ఆదీనంలో ఉన్న చమురు నౌకాశ్రయంపై అమెరికా భీకర వైమానిక దాడులు జరిపింది. ఘటనలో 74 మంది చనిపోగా, 171 మంది గాయపడినట్లు హౌతీలు ప్రకటించారు. కాగా, హౌతీల లక్ష్యాలపై ట్రంప్‌ ప్రభుత్వం మార్చి 15 నుంచి కొనసాగిస్తున్న దాడుల్లో శక్తివంతమైంది ఇదేనని చెబుతున్నారు. గురువారం రాత్రి జరిగిన దాడితో రస్‌ ఇసా ఆయిల్‌ పోర్టులో భీకర శబ్ధాలతోపాటు భారీగా మంటలు వ్యాపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

 దాడికి సంబంధించిన గ్రాఫిక్‌ ఫుటేజీని హౌతీలు విడుదల చేశారు. ఇరాన్‌ దన్నుతో చెలరేగుతున్న హౌతీల ప్రధాన ఆదాయ వనరును ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. గత పదేళ్లుగా ఈ ప్రాంతంలో భయోత్పాతం సృష్టించే హౌతీలకు అక్రమ ఆదాయం అందకుండా చేయడానికే ఈ దాడుల లక్ష్యమని తెలిపింది. శాంతియుతంగా జీవించాలని కోరుకునే యెమెన్‌ ప్రజలకు హాని తలపెట్టడం తమ ఉద్దేశం కాదని పేర్కొంది. అమెరికా దాడిని హౌతీలు తీవ్రంగా ఖండించారు. ఇది యెమెన్‌ సార్వభౌమత్వంపై చేసిన దాడిగా పేర్కొన్నారు.  
 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)