Breaking News

విశ్వానికి అంతముందా!

Published on Sat, 07/26/2025 - 04:31

విశ్వ సిద్ధాంతం సరికొత్త మలుపు తిరిగింది. ఈ అనంత విశ్వం నిరంతరాయంగా, ఎప్పటికీ విస్తరిస్తూనే ఉంటుందన్నది ఇప్పటిదాకా సైంటిస్టులు నమ్ముతూ, చెబుతూ వచ్చిన మాట. కానీ అది నిజం కాదని, విశ్వానికి అంతముందని కొత్త సిద్ధాంత వ్యాసం ఒకటి చెబుతోంది. మరో 2,000 కోట్ల ఏళ్లకు విశ్వం కథ పూర్తిగా ముగిసిపోతుందని అది అంటోంది. దాంతోపాటే నక్షత్రాలు, గ్రహాలు, విశ్వ శక్తి... ఇలా సర్వమూ అంతమైపోతుందట. దీన్ని ‘బిగ్‌ క్రంచ్‌’గా సదరు వ్యాసం పేర్కొంది. 

డార్క్‌ ఎనర్జీగా పిలిచే రహస్య విశ్వ చోదక శక్తి స్థిరంగా, సానుకూలాత్మకంగా కొనసాగుతుందన్న సిద్ధాంతంపై విశ్వ నిత్య విస్తరణవాదం ఆధారపడి ఉంది. కానీ డార్క్‌ ఎనర్జీ స్థిరంగా ఉండనే ఉండదని పరిశోధకులు తాజాగా చెబుతున్నారు. డార్క్‌ ఎనర్జీ సర్వే (డీఎన్‌ఎస్‌), డార్క్‌ ఎనర్జీ స్పెక్ట్రోస్కొపిక్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (డీఈఎస్‌ఐ) అనే రెండు పెద్ద అంతర్జాతీయ ప్రాజెక్టుల తాలూకు తాజా డేటా ఆధారంగా వారు ఈ మేరకు సూత్రీకరించారు. 

డార్క్‌ ఎనర్జీ కాలక్రమంలో మారుతుందని పేర్కొన్న ఇటీవలి సర్వే ఆక్సియాన్‌–డార్క్‌ ఎనర్జీ మోడల్‌ (ఏడీఈ)ను సిద్ధాంతాన్ని ఇది సమర్థిస్తోంది. దీన్ని ప్రస్తుత సూత్రీకరణకు వర్తింపజేస్తే అంతరిక్షం ఎలా ప్రవర్తిస్తుందన్న దాన్ని లెక్కించే విశ్వ స్థిరాంకం నిజానికి ప్రతికూల శక్తి అయి ఉండొచ్చని చెప్పే సంకేతాలను సైంటిస్టులు గమనించారు. ఈ మొత్తం సిద్ధాంతంలో అతి కీలకమైన అంశం ఇదే.

 ప్రతికూల విశ్వ స్థిరాంకపు ఉనికి అంటే అంతిమంగా దాని విస్తరణను ఆకర్షణ శక్తి అధిగమించేస్తుంది. అప్పటినుంచి విశ్వం వృద్ధి చెందడం నిలిచిపోయి తిరోగమన బాట పడుతుంది. అంతిమంగా అది అంతమైపోతుంది. ఈ బిగ్‌ క్రంచ్‌ ఫలితంగా విశ్వంలోని సమస్త శక్తీ పీల్చుకుపోయి అత్యంత సాంద్రతతో కూడిన బిందువుగా మారుతుంది. ఇదే గనక నిజమైతే బిగ్‌ బ్యాంగ్‌ సిద్ధాంతమే తప్పని భావించాల్సి  ఉంటుంది.

ఆయువు 3,330 కోట్ల ఏళ్లు
విశ్వం మొత్తం ఆయుష్షు 3,330 కోట్ల ఏళ్లని ఈ తాజా సిద్ధాంత వ్యాసం ప్రతిపాదించింది. విశ్వం పుట్టి 1,380 కోట్ల ఏళ్లు గడిచినట్టు సైంటిస్టులు తేల్చారు. ఆ లెక్కన దాని ఆయుఃప్రమాణంలో సగం ముగిసిపోయినట్టే లెక్క. అయితే దీన్ని పూర్తిగా విశ్వసించాలంటే మరింత కచ్చితమైన గణాంకాలు అవసరమని సైంటిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా డార్క్‌ ఎనర్జీ కాలంతో పాటుగా కచ్చితంగా మారుతుందన్న దానిలో నిజానిజాలు తేలాల్సి ఉంటుంది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

#

Tags : 1

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)