Breaking News

డౌట్‌ అక్కర్లేదు.. ఇవి సింహాలే..

Published on Sat, 04/19/2025 - 07:27

ఎండాకాలం ఎఫెక్ట్‌ మరి.. దక్షిణాఫ్రికాలోని యుకుటులా రిజర్వ్‌ పార్క్‌లో జెడ్‌ నెల్సన్‌ అనే ఫొటోగ్రాఫర్‌ ఈ చిత్రాన్ని తీశారు. 2025 సోనీ వరల్డ్‌ ఫొటోగ్రఫీ పురస్కారాల్లో ఈ చిత్రం వైల్డ్‌ లైఫ్‌ అండ్‌ నేచర్‌ విభాగంలో మొదటి బహుమతిని గెలుచుకుంది. ఈ లయన్‌ రిజర్వులో శిక్షణ పొందిన గైడ్ల సాయంతో మనం సింహాలకు చాలా దగ్గరగా వెళ్లొచ్చు. వాటి జీవనశైలిని గమనించవచ్చు.

రోమ్‌లో వాన్స్, మెలోనీ టారిఫ్‌ చర్చలు
రోమ్‌: టారిఫ్‌లపై అమెరికా–ఇటలీల మధ్య జరుగుతున్న చర్చల వేదిక రోమ్‌కు మారింది. శుక్రవారం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఇటలీ ప్రధానమంత్రి జార్జియో మెలోనీతో సమావేశమయ్యారు, ప్రధాని కార్యాలయం ఛిగి ప్యాలెస్‌లో వీరు చర్చలు జరిపారు. అనంతరం, వైట్‌ హౌస్, మెలోనీ కార్యాలయం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అతిత్వరలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటలీని సందర్శించనున్నారని ఆ ప్రకటన తెలిపింది.

ఆ సమయంలోనే అమెరికా– యూరప్‌ మధ్య చర్చలు జరపాలనే విషయం పరిశీలనలో ఉందని కూడా పేర్కొంది. గురువారం వైట్‌ హౌస్‌లో చర్చల సందర్భంగా మెలోనీ పక్కనే కూర్చున్న ట్రంప్‌.. వాణిజ్యం ఒప్పందాలు కుదుర్చుకునేందుకు తాము తొందరపడటం లేదని తెలిపారు. యూరప్‌తోపాటు మధ్యధరా ప్రాంతంలో అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వామిగా ఇటలీ ఉంటుందని భావిస్తున్నామని మెలోనీ పేర్కొన్నారు. వాన్స్‌తో జరుగుతున్న చర్చల్లో సుదీర్ఘకాలం మైత్రి మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  

ఇమ్రాన్‌ సోదరీమణుల అరెస్టు 
రావల్పిండీ: జైల్లో ఉన్న పాక్‌ మాజీ ప్రధాని 72 ఏళ్ల ఇమ్రాన్‌ఖాన్‌ను కలిసేందుకు వెళ్లిన ఆయన సోదరీమణులను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన 2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు. ప్రతి మంగళ, గురువారాల్లో కుటుంబీకులు, లాయర్ల బృందం ఆయన్ను కలుస్తారు. గురువారం వెళ్లిన ఇమ్రాన్‌ సోదరీమణులు అలీమా, ఉజ్మా, నొరీన్‌తో పాటు పీటీఐ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వెనక్కు వెళ్లాలని కోరారు. వారు నిరాకరించడంతో ఘర్షణ నెలకొంది. వారిని అరెస్టు చేసి జైలుకు దూరంగా విడిచిపెట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

అడియాలా జైలు బయట పీటీఐ నేతలను అరెస్టు చేయడం ఈ వారంలో ఇది రెండోసారి. వీటిని పార్టీ ఖండించింది. బలమైన ప్రజా ప్రతిస్పందన తప్పదని హెచ్చరించింది. ఇంగ్లండ్‌లో ఉంటున్న తన పిల్లలతో మాట్లాడేందుకు, వైద్య పరీక్షలకు ఇమ్రాన్‌ పెట్టుకున్న పిటిషన్లను పాక్‌ కోర్టు ఇటీవలే అనుమతించింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)