Breaking News

15 ఏళ్లకే అమ్మ.. 33కు అమ్మమ్మ.. కొత్త ట్విస్ట్‌ ఇదే!

Published on Sat, 11/18/2023 - 07:58

తల్లి అయ్యే వయసులో అమ్మమ్మగా మారిన ఓ మహిళ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఆమె హృదయం ఇప్పుడు మరొకరిని కోరుకుంటోంది. ఆమె ఆ దేశంలో అతి పిన్న వయస్కురాలైన అమ్మమ్మ టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు ఆ మహిళ తన 34 ఏళ్ల వయసులో మరోసారి పెళ్లికూతురుగా ముస్తాబవుతోంది.

రేచెల్ మెక్‌ఇంటైర్ అనే మహిళ యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉంటోంది. మీడియా కథనాల ప్రకారం ఆమె ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన అమ్మమ్మ. కుమార్తెకు జన్మనిచ్చినప్పుడు  రేచెల్ వయసు కేవలం 15 సంవత్సరాలు. పెరిగి పెద్దయిన ఆ కుమార్తెకు వివాహం జరిగింది. ఆమె కూడా ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఫలితంగా రేచెల్ తన 33 సంవత్సరాల వయసులో అమ్మమ్మగా మారింది. రేచెల్ జీవిత చిత్రం ఎంతో ఆసక్తికరం. ఈ అమ్మమ్మ ఇప్పుడు మరోమారు పెళ్లికూతురు అవుతోంది. 

మూరత్‌ అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు రేచెల్ తన కుమార్తెకు చెప్పింది. వీరి ప్రేమకు కుమార్తె కూడా మద్దతు పలికింది. కొంతకాలం క్రితం ఆమె మూరత్‌తో తొలి చూపులోనే ప్రేమలో పడింది. ఆ తర్వాత ఇద్దరూ దగ్గరయ్యారు. ‘మూరత్‌ ప్రవర్తన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే అతనిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయానికి నా కుమార్తె కూడా మద్దతు తెలిపిందంటూ’ పెళ్లి కుమార్తెగా మారబోతున్న రాచెల్‌ సంబరపడుతూ మీడియాకు తెలిపింది. 
ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌ ఎన్నికలతో భారత్‌, పాక్‌, చైనాలకు లింకేమిటి?

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)