Breaking News

బ్రిటన్‌ రాజు చార్లెస్‌-IIIతో జెలెన్‌స్కీ భేటీ

Published on Mon, 03/03/2025 - 07:35

లండన్‌: ఉక్రెయిన్ అధ్యక్షు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ (Ukrainian President Zelensky) లండన్‌లోని సాండ్రింగ్‌హామ్ హౌస్‌లో బ్రిటన్ రాజు చార్లెస్- IIIను కలుసుకున్నారు. అంతకుముందు ఆయన బ్రిటన్‌ ప్రధాని కీర్ స్టార్మర్‌తో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి రాజకుటుంబం సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో ‘ఈ రోజు సాయంత్రం బ్రిటన్ రాజు చార్లెస్- III ఉక్రెయిన్ అధ్యక్షుడు @ZelenskyyUa ను సాండ్రింగ్‌హామ్ హౌస్‌కు స్వాగతించారు’ అని  పేర్కొన్నారు.

సాండ్రింగ్‌హామ్ హౌస్ అనేది ఇంగ్లాండ్‌లోని నార్ఫోక్‌లో ఉన్న ఒక ప్రైవేట్ నివాసం. ఇది సాంప్రదాయకంగా బ్రిటిష్ రాజకుటుంబం  ఆధీనంలో ఉంటుంది. ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని 10 డౌనింగ్ స్ట్రీట్‌కు స్వాగతించారు. ఉక్రెయిన్‌కు బ్రిటన్ మద్దతు ఉంటుందని జెలెన్స్కీకి బ్రిటన్ రాజు చార్లెస్- III (UKs King Charles iii)హామీ ఇచ్చారని అల్ జజీరా నివేదించింది.
 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వైట్ హౌస్‌లో జెలెన్‌స్కీ జరిపిన చర్చలు ఉద్రిక్తతలకు దారితీశాయి. వాషింగ్టన్‌ పర్యటన అనంతరం జెలెన్‌స్కీ  బ్రిటన్ రాజు చార్లెస్- IIIని కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇది కూడా చదవండి: సోమనాథుని సన్నిధిలో ప్రధాని మోదీ పూజలు

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)