Breaking News

ఉక్రెయిన్‌ ప్రతీకారం.. రష్యా ఆక్రమిత ప్రాంతాలపై బాంబుల దాడి

Published on Sat, 09/07/2024 - 15:16

రష్యా- ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఓవైపు ఉక్రెయిన్‌పై ఆధిపత్యం కోసం మాస్కో దళాలు క్షిపణి దాడులతో విరుచుకుపడుతున్నాయి. మరోవైపు రష్యా సైన్యాలను ధీటుగా ఎదుర్కొంటూనే సమయం చిక్కినప్పుడల్లా ప్రత్యర్థి దేశంపై బాంబుల దాడికి దిగుతోంది ఉక్రెయిన్‌.. తాజాగా రష్యా ఆక్రమిత ప్రదేశాలపై  ఉక్రెయిన్‌ తన ప్రతాపం చూపించింది.

రష్యా ఆధీనంలో ఉన్న ఖర్కీవ్‌ ప్రాంతంలో డ్రాగన్‌ డ్రోన్లతో థర్మైట్‌ బాంబులను ఉక్రెయిన్‌ జారవిడిచింది. కొన్ని రష్యన్‌ సైనిక స్థావారాలను లక్ష్యంగా చేసుకొని నిప్పుల వర్షం కురిపించింది. దీంతో స్థానికంగా ఉన్న కొన్ని వందలాది చెట్లు కాలి బూడిదయ్యాయి. . రష్యా మిలటరీకి చెందిన కొన్ని వాహనాలు కూడా ధ్వంసమైనట్లు సమాచారం.

అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు గానీ.. ఖోర్న్‌ గ్రూప్‌ పేరుతో ఉన్న  టెలిగ్రామ్‌ ఛానల్‌ ఈవీడియోలను బయటపెట్టింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటి ద్వారా చాలా తక్కువ ఎత్తులో నుంచి ఓ డ్రాగన్‌ డ్రోన్‌ ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.

అత్యంత ప్రమాదకరమైన థర్మైట్‌ బాంబులు..
థర్మైట్‌ బాంబులను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలుగా పరిగణిస్తారు. అల్యూమినియం పొడి, ఐరన్‌ ఆక్సైడ్‌ కలిసిన ఈ థర్మైట్‌ బాంబులు అత్యధికంగా 2500 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. 

ఇవి చెట్లు, కోటలే కాకుండా ఇనుప లోహాలను, సైతం ఇవి క్షణాల్లో కరిగించగలవు. 2023లో రష్యా కూడా ఉక్రెయిన్‌ పట్టణం వుహ్లెదర్‌పై ఈ థర్మైట్ బాంబులను ఉపయోగించింది. అయితే వీటిని జనాలు, సైన్యం నివసించే ప్రాంతాల్లో వీటిని జారవిడిస్తే పెనువిపత్తు సంభవించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)