Breaking News

స్టార్మర్‌తో జెలెన్‌స్కీ చర్చలు 

Published on Sun, 03/02/2025 - 06:10

లండన్‌: అమెరికా పర్యటనను అర్ధంతరంగా ముగించుకున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ షెడ్యూల్‌ కంటే ఒక రోజు ముందుగా శనివారమే బ్రిటన్‌ చేరుకున్నారు. ప్రధాని కియర్‌ స్టార్మర్‌ తన అధికార నివాసం 10, డౌనింగ్‌ స్ట్రీట్‌ వద్ద ఆయనకు స్వాగతం పలికారు. నేతలిద్దరూ ఆలింగనం చేసుకున్నారు. ఉక్రెయిన్‌కు బ్రిటన్‌ ఇకముందు కూడా అన్నివిధాలా అండగా నిలుస్తుందని స్టార్మర్‌ పునరుద్ఘాటించారు. 

మూడేళ్లుగా తమకు బ్రిటన్‌ అందిస్తూ వస్తున్న మద్దతుకు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నేతలిద్దరూ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఉక్రెయిన్‌ యుద్ధంపై అమెరికా వైఖరిలో వచ్చిన పెను మార్పు, అధ్యక్షుడు ట్రంప్‌ వ్యవహార శైలి తదితరాలు ప్రస్తావనకు వచి్చనట్టు సమాచారం. ఆదివారం  లండన్‌లో యూరప్‌ నేతల భేటీ జరగనుంది. అందులో జెలెన్‌స్కీ పాల్గొనే అవకాశముంది. ఉక్రెయిన్‌ యుద్ధం, యూరప్‌ భద్రతే ప్రధాన అజెండాగా భేటీ జరగనుంది. నిజానికి మార్చి 6న పారిస్‌లో యూరప్‌ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. అంతకు కేవలం రెండు రోజుల ముందు స్టార్మర్‌ ఆహ్వానంపై యూరప్‌ దేశాధినేతలంతా లండన్‌లో భేటీ కానుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.  

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు