Breaking News

భారతీయ యాసను వెక్కిరించిన కానిస్టేబుల్‌

Published on Tue, 11/28/2023 - 05:48

లండన్‌: ఫిర్యాదు చేసేందుకు ఫోన్‌ చేసిన ఒక మహిళ భారతీయ యాసను వెక్కిరించిన పోలీస్‌ కానిస్టేబుల్‌ను బ్రిటన్‌ క్రమశిక్షణా ట్రిబ్యూనల్‌ విధుల నుంచి తప్పించింది. గత ఏడాది నవంబర్‌ 29వ తేదీ జరిగిన ఘటన తాలూకు కేసులో పోలీసు ప్యాట్రిక్‌ హ్యారిసన్‌ను దోషిగా తేలుస్తూ లండన్‌లోని ట్రిబ్యూనల్‌ తీర్పుచెప్పింది. గత నెలలో తీర్పువెలువగా వివరాలు తాజాగా బహిర్గతమయ్యాయి.

వెస్ట్‌ యార్క్‌షైర్‌ పోలీస్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేసే ప్యాట్రిక్‌ ఘటన జరిగిన రోజు లండన్‌లోని ఫోర్స్‌ కాల్‌సెంటర్‌లో విధుల్లో ఉన్నాడు. తనపై ఒకరు విద్వేష నేరానికి పాల్పడ్డారంటూ ఒక మహిళ ఈ కాల్‌సెంటర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదుచేసింది. ఫిర్యాదును పట్టించుకోకుండా ప్యాట్రిక్‌ ఆమె మాట్లాడే భారతీయ యాసను వెక్కిరించడం మొదలెట్టాడు. అసలది విద్వేష నేరమని ఎందుకు అనుకుంటున్నావ్‌? అని భారతీయ యాసను అనుకరిస్తూ వెటకారంగా మాట్లాడాడు.

ఫోన్‌ కట్‌చేశాక ఆమె ఫిర్యాదుచేస్తుందేమోనని భయపడ్డాడు. ఆమెకు వేరే నంబర్‌ నుంచి ఫోన్‌ చేసి ఆమె ఏం అనుకుందోనని ఆరాతీశాడు. ప్యాట్రక్‌ చర్యతో విసిగిపోయిన ఆమె ‘టెల్‌ మామా’కు ఫిర్యాదుచేసింది. బ్రిటన్‌లో ముస్లింవ్యతిరేక ఘటనలపై ప్రభుత్వం ‘టెల్‌ మామా(ఎంఏఎంఏ–మెజరింగ్‌ యాంటీ ముస్లిం అటాక్స్‌) ప్రాజెక్ట కింద చర్యలు తీసుకుంటోంది. ఈ ఉదంతంలో ప్యాట్రిక్‌ వైఖరిని ట్రిబ్యూనల్‌ తీవ్రంగా తప్పుబట్టింది.

‘15 ఏళ్లపాటు విధుల్లో ఉంటూ కూడా అధికారం, హోదాను మరిచి మహిళతో అనుచితంగా మాట్లాడాడు. ఈయన వైఖరితో ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం, విశ్వాసం తగ్గిపోతాయి. ఇది మొత్తం పోలీసు వ్యవస్థకే అప్రతిష్ట. జాతి వివక్ష, ఇస్లామోఫోబియా దేశవ్యాప్తంగా పోలీసుల్లో గూడుకట్టుకోవడం ఆందోళనకరం’’ అని ట్రిబ్యూనల్‌ ఆగ్రహం వ్యక్తంచేసింది. అతడిని విధుల నుంచి తప్పించింది. 

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)