ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌: కష్టాల్లో కీర్‌ స్టార్మర్‌

Published on Tue, 02/10/2026 - 04:33

లండన్‌: అమెరికాలో మొదలైన ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం బ్రిటన్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏకంగా కీర్‌ స్టార్మర్‌ ప్రభుత్వ పునాదులనే కదిలిస్తోంది! సంపన్నులు, రాయబారులు, అగ్రనేతలు, రాజకుటుంబీకుల లైంగికావసరాలు తీర్చేందుకు అమాయక యువతులు, ముఖ్యంగా మైనర్లను అక్రమంగా సరఫరా చేసిన కేసులో ప్రధాన నిందితుడు ఎప్‌స్టీన్‌ బతికున్నప్పటి కంటే చనిపోయాక ఈ అంశం మరింత ప్రకంపనలు సృష్టిస్తోంది. బ్రిటన్‌ ప్రభుత్వ పెద్దల పదవులకు ఎసరుపెడుతోంది. 

ఇప్పటికే ఒకరిని బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ స్వయంగా తొలగించగా పశ్చాత్తాపంతో మరొకరు రాజీనామా చేశారు. తాజాగా సోమవారం స్టార్మర్‌ ప్రభుత్వంలో కమ్యూనికేషన్స్‌ విభాగ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టిమ్‌ అలాన్‌ తన పదవికి రాజీనామాచేశారు. పదవి చేపట్టిన కేవలం 5 నెలలకే ఆయన తప్పుకోవాల్సి రావడం గమనార్హం. ‘‘స్టార్మర్‌ ప్రభుత్వంలో కొత్త బృందం కొలువు తీరేందుకు మార్గం సుగమం చేస్తూ నేను వైదొలగుతున్నా.

ప్రధానికి, ఆయన కొత్త బృందానికి విజయం చేకూరాలని కోరుకుంటున్నా’’అని టిమ్‌ వ్యాఖ్యానించారు. ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణంతో సంబంధమున్న అమెరికాలో బ్రిటన్‌ రాయబారి పీటర్‌ మాండెల్సన్‌ను గతేడాది సెపె్టంబర్‌లో స్టార్మర్‌ తొలగించారు. మాండెల్సన్‌ను ఆ పదవికి ఎంపిక చేయడానికి తన సిఫార్సే కారణమని చింతిస్తూ స్టార్మర్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మోర్గాన్‌ మెక్‌ స్వీనీ ఆదివారం రాజీనామా చేశారు.

గోర్డన్‌ బ్రౌన్‌ ప్రధానిగా ఉన్న కాలంలో వాణిజ్య శాఖ మంత్రి హోదాలో మాండెల్సన్‌ బ్రిటన్‌ విధానపర నిర్ణయాలను ఎప్‌స్టీన్‌కు రహస్యంగా ముందే చేరవేసినట్లు ఎప్‌స్టీన్‌ పత్రాల్లో తాజాగా తేలింది. దీంతో కీలక పదవుల్లో సమర్థుల నియామకంలో ప్రధానిగా స్టార్మర్‌ ఘోరంగా విఫలమయ్యారని విపక్ష పారీ్టలతో పాటు సొంత లేబర్‌ పార్టీ ఎంపీలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనకు ప్రధానిగా కొనసాగే అర్హత లేదని తిట్టిపోస్తున్నారు. 

స్టార్మర్‌ రాజీనామా చేయాల్సిందే 
ప్రధానిగా స్టార్మర్‌ తప్పుకోవాలని స్కాట్లాండ్‌లో లేబర్‌ పార్టీ నేత అనాస్‌ సర్వార్‌ డిమాండ్‌చేశారు. చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ వంటి కీలక పదవుల నుంచే రాజీనామాల పర్వం మొదలవడంతో స్టార్మర్‌ వెంటనే నష్ట నివారణ చర్యలు ఆరంభించి కేబినెట్‌ను పునర్‌ వ్యవస్థీకరించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మాండెల్సన్‌ నియామకంలో తప్పిదం చేశానని స్టార్మర్‌ క్షమాపణలు చెప్పినా విమర్శలు ఆగడం లేదు. 

ఈ వారం జరగబోయే పార్లమెంటరీ లేబర్‌ పార్టీ సమావేశంలో స్టార్మర్‌ మరోసారి తన నాయకత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే సోమవారం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ ప్రాంతానికి చేరుకున్న కేబినెట్‌ మంత్రులు పలువురు స్టార్మర్‌కు మద్దతు పలకడం విశేషం. ‘‘ఆయన పదవిలోకి వచ్చి 18 నెలలే అవుతోంది. ఆయన పనిని సవ్యంగా చేయనిస్తాం’’అని విద్యా శాఖ మంత్రి బ్రిగ్జెడ్‌ ఫిలిప్సన్, హోం మంత్రి షబానా మహ్‌మూద్‌ అన్నారు.

తొలిసారిగా స్పందించిన రాజకుటుంబం 
ఎప్‌స్టీన్‌ వ్యవహారానికి యూకే అధికార వర్గాలతో సంబంధం ఉండటంపై బ్రిటన్‌ రాజకుటుంబం ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు యువరాజు ప్రిన్స్‌ విలియం, ఆయన భార్య కేట్‌ మిడిల్టన్‌ నివసించే అధికారిక రాజప్రాసాదం ‘కెన్సింగ్టన్‌ ప్యాలెస్‌’సోమవారం ఒక ప్రకటన విడుదలచేసింది.‘‘యువరాజు కుటుంబం తాజా పరిణామాలపై చాలా మనస్తాపం చెందింది. అధికార వర్గాలతో సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడటం విస్మయం కల్గిస్తోంది. 

ఈ పరిణామాలను విలియం, కేట్‌ గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఉదంతంలో ఆనాడు బాధితులుగా మిగిలిపోయిన అమాయక టీనేజర్లు, యువతుల పోరాటానికి రాజకుటుంబం తమ సంఘీభావం వ్యక్తం చేస్తోంది’’అని కెన్సింగ్టన్‌ ప్యాలెస్‌ పేర్కొంది. అయితే రాజు చార్లెస్‌–3కు తమ్ముడు, ఇటీవల రాజకుటుంబ హోదా వదలుకున్న ఆండ్రూపై విచారణ జరిపే విషయాన్ని ప్రకటనలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఎప్‌స్టీన్‌కు చెందిన ద్వీపాల్లోని విలాసవంత ఎస్టేట్‌లకు పలుమార్లు ఆండ్రూ వెళ్లినట్లు వెల్లడైన విషయం విదితమే.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)