Breaking News

Rishi Sunak: విదేశీ పర్యటనల కోసం ఏకంగా రూ. 4 కోట్లు

Published on Sat, 04/01/2023 - 13:23

యూకే ప్రధానిగా రిషి సునాక్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయనపై వివాదాలు విమర్శలు వెల్లువలా వస్తునే ఉన్నాయి. తాజగా విదేశీ పర్యటన ఖర్చుల విషయమై మరోసారి వివాదాస్పద వార్తల్లో నిలిచారు. ఆయన విదేశీ పర్యటనల కోసం  పన్ను చెల్లింపుదారుల డ‍బ్బును ఇష్టా రాజ్యంగా ఖర్చు పెట్టారంటూ విపక్షాలు గగ్గోలు చేస్తున్నాయి. ఈ మేరకు యూకే ‍ప్రధాని రిషి సునాక్‌ విదేశీ పర్యటనల కోసం కేవలం ప్రైవేట్‌ జెట్ల కోసమే సుమారు రూ. 4 కోట్ల ఖర్చు పెట్టినట్లు నివేదిక వెల్లడించింది. ఈజిప్టులో జరిగిన కాప్‌ 27 సదస్సుకు హాజరయ్యేందకు ప్రభుత్తం ప్రైవేట్‌ జెట్లకు దాదాపు రూ. 96 లక్షలు ఖర్చు చేసింది.

ఆ తర్వాత ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సుకు సుమారు రూ. 300 లక్షలు ఖర్చుపెట్టింది. అలాగే లాట్వియా నుంచి ఎస్టోనియా పర్యటలనకు రూ. 55 లక్షలు ఖర్చు పెట్టగా, ఆయన వ్యక్తిగత ఖర్చులుగా సుమారు రూ. 2 లక్షలు ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది. దీంతో ప్రతిపక్ష లిబర్‌ డెమొక్రాట్‌ పార్టీ సభ్యులు జీవన వ్యయ సంక్షోభంలో ఇలా ప్రజా ధనాన్ని ఇలా ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేస్తారంటూ ఆగ్రహించారు. ప్రజలు ఒకపక్క పన్నులు చెల్లించలేని దీనస్థితిలో ఉంటే ఇలా దిగ్బ్రాంతికరంగా ఖర్చు చేస్తున్నారంటూ ట్విట్టర్‌ వేదికగా ప్రతిపక్షాలు మండిపడ్డాయి.

దీనిపై కన్జర్వేటివ్‌ పార్టీ వ్యాఖ్యనించిదని కూడా ఆరోపణలు చేశాయి. దీంతో లండన్‌లోని ప్రధాని కార్యాలయం డౌనింగ్‌ స్ట్రీట్‌ స్పందిస్తూ..ప్రపంచ నాయకులతో కీలక సమావేశాలు కోసం ఇది తప్పదని పేర్కొంది. భద్రత, రక్షణ వాణిజ్యంతో సహా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై చర్చించడానికి ద్వైపాక్షిక పర్యటనలు, శిఖరాగ్ర సమావేశాల సమయంలో ప్రపంచ నాయకులతో కీలక సమావేశాలను నిర్వహించడం ప్రధానమంత్రి పాత్రలో ఒక భాగమని తేల్చి చెప్పింది. అలాంటి వాటికి కోసం ప్రధాని హోదాలో ఖర్చు చేయక తప్పదని కూడా డౌన్‌ స్ట్రీట్‌ ప్రతినిధి స్పష్టం చేశారు. కాగా, ఇటీవల రిషి సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఓ కొత్త పాలసీపై విపక్షాలు ఇప్పటికే మండిపడుతున్నాయి. తన భార్య అక్షతా మూర్తి వ్యాపార ప్రయోజనాల కోసమే ఆ నూతన విధానాన్ని తీసుకొచ్చారంటూ రిషిపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.

(చదవండి: హిందూ ఫోబియాని ఖండించే తీర్మానాన్ని ఆమోదించిన రాష్ట్రంగా జార్జియా!)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)