చైనా బాటలో బ్రిటన్‌

Published on Tue, 09/23/2025 - 05:31

లండన్‌: అత్యంత ప్రతిభావంతులను ఒడిసిపట్టేందుకు చైనా మాదిరిగా బ్రిటన్‌ సైతం వడివడిగా పావులు కదుపుతోంది. హెచ్‌–1బీ వీసా వార్షిక రుసుమును అమెరికా ప్రభుత్వం ఏకంగా లక్ష డాలర్లకు పెంచడంతో సైన్స్, టెక్నాలజీ నిపుణుల చూపు ఇతర దేశాలపై పడనుంది. ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బ్రిటన్‌ ఆరాటపడుతోంది. ఈ దిశగా ఇప్పటికే వ్యూహరచన చేసినట్లు లండన్‌లోని ప్రధానమంత్రి కార్యాలయంలోని విశ్వసనీయ వర్గాలువెల్లడించాయి. 

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సృజనాత్మకత, నవ్యావిష్కరణలు చూపే ప్రతిభావంతులను తమ దేశంలోకి ఆకర్షించేందుకు వీలుగా వాళ్ల వీసా ఫీజును పూర్తిగా మాఫీ చేయాలని ప్రధాని కీర్‌ స్టార్మర్‌ సారథ్యంలోని యూకే సర్కార్‌ భావిస్తోంది. ఇప్పటికే స్టార్మర్‌ ఈ ఏడాది తొలినాళ్లలో 5.4 కోట్ల బ్రిటిష్‌ పౌండ్ల మూలనిధితో ‘ది గ్లోబల్‌ టాలెంట్‌ టాస్క్‌ఫోర్స్‌’ విభాగాన్ని ఏర్పాటుచేశారు. 

బ్రిటన్‌ ఆర్థికాభివృద్ధిని ఉరకలెత్తించేలా నవ్యావిష్కరణలు చేసే యువ ప్రతిభావంతులకు దేశంలోకి సాదర స్వాగతం పలకాలని ప్రభుత్వం యోచిస్తోంది. ట్రంప్‌ జాత్యహంకారంతో రంకెలేస్తూ హెచ్‌–1బీ వీసా ఫీజుల మాటున విదేశీ ప్రతిభావంతులను తరిమికొడుతున్న నేపథ్యంలో వాళ్లకు ఆశ్రయమిచ్చి దేశ పురోభివృద్ధికి అక్కరకొచ్చేలా ఉపయోగించుకోవాలని స్టార్మర్‌ ప్రభుత్వం ఆశిస్తోంది.

 ఇందులోభాగంగానే వీసా ప్రక్రియను వేగవంతంచేసి అడ్మినిస్ట్రేషన్‌ చార్జీలను రద్దుచేయాలని భావిస్తున్నారు. ప్రస్తుత బ్రిటన్‌లో వీసా ఫీజు 1,000 పౌండ్లుగా ఉంది. మరోవైపు 2020లో బ్రిటన్‌ గ్లోబల్‌ టాలెంట్‌ వీసాను తీసుకొచ్చింది. దీని కోసం 766 పౌండ్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక ఆరోగ్యసేవలు కావాలంటే ఆమేరకు సర్‌చార్జ్‌లు కలుపుకుంటే ఒక్కో వీసాదారుడు 1,035 పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది. 

జీవిత భాగస్వామి, సంతానానికి సైతం ఇవే చార్జీలు వర్తిస్తాయి. అయితే ప్రపంచంలోనే సైన్స్, టెక్నాలజీ రంగాలకు సంబంధించి టాప్‌–5 విశ్వవిద్యాల యాల్లో అభ్యసించిన, ప్రతిష్టాత్మక విద్య, ఉపాధిరంగ అవార్డ్‌లను గెల్చుకున్న వ్యక్తులకు ఎలాంటి వీసా ఫీజులను వసూలుచేయకూడదని బ్రిటన్‌ ప్రభుత్వం యోచిస్తోంది. ఆర్థికాభివృద్ధి పెంపే లక్ష్యంగా అత్యంత ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, టీచర్లు, డిజిటల్‌ రంగ నిపుణుల వీసా ఫీజును మాఫీ చేయాలని భావిస్తున్నారు. 
 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)