Breaking News

మంత్రిపై బాడీగార్డు కాల్పులు.. స్పాట్‌లోనే మృతి

Published on Wed, 05/03/2023 - 11:59

కంపాలా: ఉగాండా దేశంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉగాండా దేశ మంత్రిపై తన బాడీగార్డు కాల్పులు జరపడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. దీంతో, ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

వివరాల ప్రకారం.. ఉగాండా రాజధాని కంపాలాలో ఆ దేశ కార్మిక శాఖ సహాయమంత్రి, రిటైర్డ్‌ కల్నల్‌ చార్లెస్‌ ఎంగోలా నివాసంలో ఆయనకు బాడీగార్డుకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో బాడీగార్డ్‌ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మంత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం, బాడీగార్జ్‌ కూడా అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని మృతి చెందాడు. 

అయితే, మంత్రి వద్ద బాడీగార్డ్‌గా పనిచేస్తున్న సదరు వ్యక్తికి చాలా కాలంగా వేతనాలు చెల్లించడం లేదని సమాచారం. ఈ కారణంతోనే మంత్రిని బాడీగార్డు కాల్చి చంపినట్లు సమాచారం. ఇక, ఈ కాల్పుల ఘటనపై ఆర్మీ అధి​కారులు దురదృష్టకరమని.. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టినట్లు ఆర్మీ ప్రతినిధి ఫెలిక్స్‌ కులాయిగ్వే వెల్లడించారు. ఎంగోలా హత్యకు దారితీసిన కారణాలు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: డింగ్‌ డాంగ్‌ డిచ్‌ కేసు: ముగ్గురిని బలిగొన్న ఎన్నారై చంద్రను దోషిగా తేల్చిన కోర్టు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)