Breaking News

వాహనాల బీభత్సం.. 63 మంది దుర్మరణం

Published on Wed, 10/22/2025 - 16:39

నైరోబి: ఉగాండాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.  ఒక ప్రధాన రహదారిపై బుధవారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్నాయి. తరువాత అవి మరో నాలుగు వాహనాలను బలంగా తాకాయి. ఈ దుర్ఘటనలో 63 మంది మరణించారు. ప్రమాదంలో లెక్కలేనంతమంది గాయపడ్డారు.

కిర్యాండోంగో జిల్లాలోని కంపాలా-గులు హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. ముందుగా రెండు బస్సులు ఓవర్‌టేకింగ్ చేస్తూ, ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సమయంలో ఆ బస్సుల డ్రైవర్లు ప్రమాదాన్ని తప్పించేందుకు ప్రయత్నించారు. దీంతో అవి ఒక ట్రక్‌, ల్యాండ్ క్రూయిజర్‌తో పాటు నాలుగు వాహనాలను నియంత్రణ కోల్పోయేలా చేయడంతో, అవి బోల్తా పడ్డాయని పోలీసులు తెలిపారు. తొలుత మృతుల సంఖ్యను 63గా ప్రకటించిన పోలీసులు ఆ సంఖ్యను 46గా సవరించారు. ​‍ప్రమాదం జరిగిన ప్రదేశంలో అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి.  

ప్రమాదంలో గాయపడిన వారిని కిర్యాండోంగో ఆస్పత్రితో పాటు సమీపంలోని ఇతర వైద్య కేంద్రాలకు తరలించినట్లు  అధికారులు తెలిపారు. అయితే గాయపడిన వారి సంఖ్య, వారి గాయాల తీవ్రత తదితర వివరాలను వారు అందించలేదు. బాధిత కుటుంబాలకు ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసేవేని సంతాపాన్ని ప్రకటించారు. వాహనాలు నడిపేటప్పుడు  డ్రైవర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.

గత ఏప్రిల్‌లో పశ్చిమ ఉగాండాలో ఒక బస్సు అదుపు తప్పి, హైవేపై బోల్తా పడటంతో 10 మంది మరణించారు. అదేవిధంగా గత ఆగస్టులో ఒక ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 20 మంది మరణించారు. గత ఏడాది కంపాలా-గులు హైవేపై ఒక ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 26 మంది మృతిచెందారు. రెండేళ్ల క్రితం జనవరిలో కెన్యా-ఉగాండా సరిహద్దులో జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది మృతిచెందగా, 49 మంది గాయపడ్డారు. 
 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)