UAE: 900 మంది భారత ఖైదీల విడుదలకు రంగం సిద్ధం

Published on Sat, 01/24/2026 - 00:27

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జైళ్లలో మగ్గుతున్న 900 మందికి పైగా భారత ఖైదీల విడుదలకు రంగం సిద్దమైంది. జైళ్ల నుంచి విడుదల కానున్న ఖైదీల జాబితాను యూఏఈ అధికారులు అబుదాబిలోని భారత రాయబార కార్యాలయానికి అందజేశారు. గతేడాది డిసెంబర్ 2న యూఏఈ జాతీయ దినోత్సవం (ఈద్ అల్ ఇతిహాద్) పురస్కరించుకుని మొత్తం 2,937 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు అధ్యక్షుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్ ప్రకటించారు. 

ఈ 2,937 మందిలో 900 మందికి పైగా భారతీయులు ఉండటం విశేషం. షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్ క్షమాభిక్ష మేరకే ఇప్పుడు వందలాది మంది ఖైదీలకు విముక్తి లభించనుంది. కాగా ఈ విడుదల ప్రక్రియలో యూఏఈ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శిక్షలో భాగంగా ఖైదీలకు విధించిన జరిమానాలు, పరిహార చెల్లింపులను కూడా ప్రభుత్వమే భరించనుంది. 

ఈ నిర్ణయం యూఏఈ నిబద్ధతకు ఇది ప్రతిబింబంగా నిలుస్తుందని, వారి కుటుంబ సభ్యులపై పడే భారం, బాధ్యతలు తగ్గుతాయని యూఏఈ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా యూఏఈ, భారత్ మధ్య మంచి స్నేహం ఉంది. ఇటీవలే అధ్యక్షుడు నహ్యాన్ భారత్ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)