Breaking News

ఇజ్రాయెల్‌ ఓవరాక్షన్‌.. బ్రిటన్‌ ఎంపీలతో అనుచిత ప్రవర్తన!

Published on Sun, 04/06/2025 - 11:55

జెరూసలేం: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం వేళ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లిన ఇద్దరు బ్రిటన్‌ ఎంపీలను అక్కడి అధికారులు అడ్డుకుని నిర్బంధించారు. దీంతో, ఈ ఘటనపై బ్రిటన్‌ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్‌ లామీ మండిపడ్డారు.

వివరాల ప్రకారం.. బ్రిటన్‌లో అధికార లేబర్‌ పార్టీకి చెందిన యువాన్ యాంగ్‌, అబ్తిసామ్‌ మొహమ్మద్‌ ఇద్దరూ శనివారం ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లారు. లుటాన్ నుంచి ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో వారిని అధికారులు అడ్డుకుని నిర్బంధించారు. అనంతరం కొంత సమయం తర్వాత వారిద్దరినీ విడిచిపెట్టారు. తమ భద్రతా దళాల కార్యకలాపాలను డాక్యుమెంట్ చేయడంతో పాటు తమపై వ్యతిరేకతను పెంచేందుకు ఆ ఎంపీలు వచ్చారని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. అందుకే వారి రాకను అడ్డుకున్నట్లు తెలిపారు. సమాచారం లేకుండా ఇక్కడ వచ్చారు? అని ప్రశ్నించారు అధికారులు. దీంతో, ఇజ్రాయెల్‌ టెల్‌అవీవ్‌ చర్యను యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్‌ లామీ తీవ్రంగా పరిగణించారు.

ఈ నేపథ్యంలో  డేవిడ్‌ లామీ స్పందిస్తూ..‘ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లిన యూకే పార్లమెంటరీ ప్రతినిధి బృందంలోని ఇద్దరు ఎంపీలను అక్కడి అధికారులు నిర్బంధించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. వారి చర్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మా ఎంపీలతో వారు ఈ విధంగా వ్యవహరించడం సరికాదు. ఇదే విషయాన్ని అక్కడి ప్రభుత్వంలోని నా సహచరులకు స్పష్టం చేశాను. ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ, గాజాలో శాంతి నెలకొల్పడం వంటి అంశాలకు సంబంధించిన చర్చలపైనే మా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది’ అని తెలిపారు.

ఇక, యువాన్ యాంగ్‌ బిట్రన్‌లోని ఎర్లీ, వుడ్డీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. అబ్తిసామ్‌ మొహమ్మద్‌ (Abtisam Mohamed) షెఫీల్డ్‌ సెంట్రల్‌కు ఎంపీగా ఉన్నారు. వీరిద్దరి నిర్భందానికి సంబంధించిన కథనాలు పలు మీడియా చానల్స్‌లో ప్రసారం అయ్యాయి. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)