Breaking News

అమెరికాలో ఢీకొన్న రెండు విమానాలు.. పలువురు మృతి

Published on Thu, 02/20/2025 - 07:11

వాషింగ్టన్‌: అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మరో రెండు చిన్న విమానాలు ఢీకొన్న ‍ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ప్రమాదం జరిగిన వెంటనే భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వివరాల ప్రకారం.. అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో రెండు చిన్న విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం రన్‌వే-12పై విమానాలు సెస్నా 172S, లాంకైర్ 360 MK II ఢీకొన్నట్టు జాతీయ రవాణా భద్రతా బోర్డు తెలిపింది. ఈ రెండు విమానాలు ఫిక్స్‌డ్‌-వింగ్‌, సింగిల్‌ ఇంజిన్‌ విమానాలని పేర్కొంది. ఈ ఘటనలో మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక, ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 

ఇక, ఇటీవలి కాలంలో అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. విమాన ప్రమాదాల కారణంగా వందల సంఖ్యలో ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జనవరి 30న అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వాషింగ్టన్‎లోని రోనాల్డ్ రీగన్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతున్న విమానం గాల్లో మిలిటరీ హెలికాప్టర్‎ను ఢీకొట్టింది. విమానం, హెలికాప్టర్ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ప్రమాద సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులు ఉన్నారు. అనంతరం, జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రయాణీకులు మరణించారు. 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)