ట్విటర్‌ ప్లాట్‌ఫామ్‌లో భారీ మార్పు‌! అతి త్వరలో..

Published on Thu, 09/01/2022 - 21:30

మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ట్విటర్‌.. అతిత్వరలో భారీ మార్పు తీసుకురానుంది. ఎడిట్‌ ట్వీట్‌ బటన్‌ వెసులుబాటును తేనుంది. అయితే.. దీనిని ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రయిబర్స్‌కు మాత్రమే రాబోయే రోజుల్లో అందించనున్నట్లు ట్విటర్‌ పేర్కొంది.

ట్విటర్‌లో ఒకసారి గనుక ట్వీట్‌ చేస్తే.. దానిని ఎడిట్‌ చేసే అవకాశం లేదు ఇప్పటిదాకా. అయితే ఎడిట్‌ బటన్‌ వల్ల ట్వీట్‌ పబ్లిష్‌ అయిన 30 నిమిషాల్లోపు ట్వీట్‌ను ఎడిట్‌ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. సెండ్‌ బటన్‌ నొక్కాక 30 సెకన్ల లోపు అన్‌డూ ద్వారా క్యాన్సిల్‌ కూడా చేయొచ్చు. ట్విటర్‌యూజర్లు.. దానిని క్లిక్‌ చేసి మార్పులు, ఒరిజినల్‌గా వాళ్లు చేసిన ట్వీట్‌ను సైతం చూసే వెసులుబాటు తేనుంది. 

ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా 320 మిలియన్ల మంది యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. చాలాకాలంగా ఎడిట్‌ ఆప్షన్‌ను తీసుకురావాలని యూజర్లు కోరుతున్నా.. ట్విటర్‌ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. దీంతో ఇప్పుడు తేనున్న ఈ ఆప్షన్‌ ముందుముందు యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు.

అయితే.. 2020లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అప్పటి ట్విటర్‌ సీఈవో జాక్‌ డోర్సే.. ట్విటర్‌ ఎప్పటికీ ఎడిట్ ట్వీట్‌ ఫీచర్‌ తేకపోవచ్చని కామెంట్‌ చేశాడు. ఈ ఫీచర్‌ వల్ల తప్పుడు సమాచారం వ్యాప్తి కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు. అంతేకాదు కొందరు టెక్‌  నిపుణులు సైతం ఎడిట్‌ ట్వీట్‌ బటన్‌ వల్ల స్టేట్‌మెంట్లను మార్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఇదీ చదవండి: తల్లిదండ్రులు, భార్య గురించి రిషి సునాక్‌ ఏమన్నారంటే..

#

Tags : 1

Videos

జగన్ ఒక్క పిలుపు.. గ్రాండ్ సక్సెస్..

కూటమి కుట్రను ఎడమ కాలితో తన్నిన ఏపీ ప్రజలు

హైకోర్టు షాక్.. చంద్రబాబు చేసిన పనికి నోరెళ్లబెట్టింది

కోటి సంతకాల పేపర్లతో గవర్నర్ ను కలవనున్న జగన్

నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్

కేంద్రానికి దొరక్కుండా.. బయటపడ్డ అతిపెద్ద స్కామ్

ఏక్షణమైనా... రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

అన్ని ఆధారాలు చూపించినా స్పీకర్ న్యాయం చేయలేదు

చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ

Vivekanand: వదిలే ప్రసక్తి లేదు తీర్పుపై న్యాయపోరాటం చేస్తాం

Photos

+5

హీరోయిన్ రష్మిక.. గర్ల్స్ గ్యాంగ్‌తో శ్రీలంక ట్రిప్ (ఫొటోలు)

+5

హ్యాపీ బర్త్ డే మై హార్ట్‌బీట్.. భర్తకు జెనీలియా విషెస్ (ఫొటోలు)

+5

వంతారలో మెస్సీ.. వన్య ప్రాణులతో సందడి (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో ఆలిండియా పోలీస్ బ్యాండ్ పోటీలు (చిత్రాలు)

+5

తిరుమలలో నటి స్వాతి దీక్షిత్‌ (ఫోటోలు)

+5

భార్యతో కలిసి నిర్మాత దిల్ రాజు ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

శ్రీవారిలో సేవలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ దంపతులు (ఫొటోలు)

+5

జోజినగర్‌కు వైఎస్‌ జగన్‌ రాక.. పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో.. ఈ ఏడాది మేటి చిత్రాలు చూశారా?

+5

ఇంద్రకీలాద్రి : సంబరంగా ముగిసిన దీక్ష విరమణ ఉత్సవాలు (ఫొటోలు)