Breaking News

టర్కీ, సిరియాలో 29,000 దాటిన భూకంప మృతులు..

Published on Sun, 02/12/2023 - 15:52

ఇస్తాన్‌బుల్‌: తుర్కియే(టర్కీ), సిరియాలో భూకంప మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శిథిలాలు తవ్వేకొద్ది వేల సంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 29,000మందికిపైగా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. టర్కీలో 24,617 మంది, సిరియాలో 4,500 మంది మరణించినట్లు తెలిపారు. పరిస్థితి చూస్తుంటే ఈ సంఖ్య 50 వేలకు పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి అధికారులు అంచనా వేస్తున్నారు.

టర్కీ, సిరియా భూకంపం ప్రాంతాల్లో సహాయక చర్యలు ఏడో రోజూ కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారులు సహా అనేక మందిని సహాయక బృందాలు రక్షించాయి.  దక్షిణ టర్కీ హతాయ్ ప్రావిన్స్‌లో శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తిని 149 గంటల తర్వాత బయటకు తీశారు.

మరోవైపు టర్కీ దేశస్థులు తమ దేశంలోని బంధువుల ఇంట్లో తాత్కాలికంగా తలదాచుకోవచ్చని జర్మనీ తెలిపింది. ఈ విపత్కర పరిస్థితిలో తమవంతు సాయం అందిస్తామని చెప్పింది. ఇతర దేశాలు కూడా టర్కీకి ఆపన్నహస్తం అందిస్తున్నాయి. చైనా 53 టన్నుల టెంట్లను సాయంగా అందించింది. భారత్ ఇప్పటికే సహాయక బృందాలతో పాటు వైద్య బృందాలు, ఔషధాలు, ఇతర సామగ్రిని టర్కీకి పంపింది.
చదవండి: టర్కీ విధ్వంసం.. మూత్రం తాగి బతికిన యువకుడు

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)