Breaking News

డొనాల్ట్‌ ట్రంప్‌ ఓడిపోయి ఉంటేనా..

Published on Tue, 01/14/2025 - 13:40

అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించడానికి ఇంకో వారం మాత్రమే ఉంది. ఈలోపు ఆయనకు సంబంధించిన ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ట్రంప్‌ గనుక ఓడిపోయే ఉంటే.. ఆయనకు కచ్చితంగా శిక్ష పడేదని అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ మంగళవారం ఓ నివేదిక రిలీజ్‌ చేసింది.

స్పెషల్‌ కౌన్సెల్‌ జాక్‌ స్మిత్‌(Jack Smith) నివేదిక ప్రకారం.. 2020  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మోసం జరిగిందంటూ ట్రంప్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే.. ఉద్దేశపూర్వకంగానే ఆయన అసత్య ప్రచారాలకు దిగారని, తద్వారా శాంతియుతంగా అధికార మార్పిడికి భంగం కలిగించారని అభియోగాలు నమోదయ్యాయి. దీనిని తీవ్ర నేరంగా స్పెషల్‌ కౌన్సల్‌ జాక్‌ స్మిత్‌ పరిగణించారు. అంతేకాదు.. అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థను తన అబద్ధాలతో ట్రంప్‌ భ్రష్టు పట్టించే యత్నమూ చేశారనే పేర్కొన్నారు. 

ట్రంప్‌పై అభియోన్నింటికి సరైన ఆధారాలున్నాయి. ఒకవేళ ట్రంప్‌ కిందటి ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో గనుక ఓడిపోయి ఉంటే.. ఈ నేరాలకుగానూ కచ్చితంగా శిక్ష పడేది అని ఆ నివేదిక స్పష్టం చేసింది.

అయితే అర్ధరాత్రి విడుదలైన ఈ నివేదికను ట్రూత్‌ సోషల్‌ వేదికగా ట్రంప్‌ తప్పుబట్టారు. జాక్‌ స్మిత్‌ను తీవ్రంగా విమర్శించారు. ఇదిలా ఉంటే.. 2020 ఎన్నికల వ్యవహారంపై గతంలో ట్రంప్‌ మీద స్మిత్‌ అనేక ఆరోపణలను నమోదు చేశారు. ట్రంప్‌పై నమోదైన రెండు ఫెడరల్‌ క్రిమినల్‌ కేసులను ఆయనే పర్యవేక్షించారు.

అయితే ట్రంప్‌ అధ్యక్షుడిగా గెలవడంతో ఆయన రాజీనామా చేస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తాజాగా ఆయన ట్రంప్‌పై పెట్టిన  అన్ని కేసులను  ఉపసంహరించుకున్నారు. అంతేకాదు.. తన నివేదిక బహిర్గతం అయ్యే సమయంలోనే తన పోస్టుకు సైతం రాజీనామా చేయడం గమనార్హం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)