Breaking News

Us Elections: ప్రైమరీల్లో ట్రంప్‌ హవా.. ఖాతాలో మరో మూడు విజయాలు

Published on Sun, 03/03/2024 - 11:40

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిని నిర్ణయించేందుకు జరుగుతున్న పార్టీ ప్రైమరీ బ్యాలెట్‌ ఎన్నికల్లో  దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విజయపరంపర కొనసాగుతోంది. తాజాగా శనివారం జరిగిన ఇదాహో, మిస్సోరి, మిచిగన్‌ రిపబ్లికన్‌ ప్రైమైరీ ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధించారు.

ట్రంప్‌నకు మద్దతుగా ఇప్పటి వరకు 244 డెలిగేట్లు ఉండగా ప్రత్యర్థి నిక్కీ  హాలేకు మద్దతుగా కేవలం 24 మంది మాత్రమే ఉన్నారు. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి నామినేట్‌ అవ్వాలంటే మొత్తం 1215 డెలిగేట్‌ల మద్దతు అవసరం. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో అతి పెద్ద ఈవెంట్‌గా చెప్పే  మార్చి 5 (సూపర్‌ ట్యూస్‌డే) మంగళవారం రోజు ఏకంగా 16 రాష్ట్రాల్లో ఏక కాలంలో ప్రైమరీ బ్యాలెట్‌ పోరు జరగనుంది. రెండు పార్టీల్లో సూపర్‌ ట్యూస్‌డే విజేతలు దేశ తుది అధ్యక్ష పోరులో తలపడతారు.  

ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల తుదిపోరులో అధికార డెమొక్రాట్లు, రిపబ్లికన్‌ పార్టీల తరపున గతంలో తలపడ్డ అభ్యర్థులు జో బైడెన్‌, ట్రంప్‌ మళ్లీ తలపడనున్నారనేది దాదాపు ఖాయమైంది. ఇటు బైడెన్‌ విషయంలో అధిక వయసు, మతిమరుపు వంటి అంశాలు, అటు ట్రంప్‌ను వేధిస్తున్న న్యాయపరమైన కేసుల చిక్కులు ఉన్నప్పటికీ ఇద్దరే మళ్లీ అధ్యక్ష పదవి రేసులో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. 

ఇదీ చదవండి.. టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద బాంబు కలకలం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)