Breaking News

ట్రాన్స్‌జెండర్లకు ట్రంప్‌ షాక్‌..!

Published on Mon, 11/25/2024 - 07:40

వాషింగ్టన్‌:అమెరికా రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ట్రంప్‌ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీటిలో భాగంగా అమెరికా ఆర్మీలో ఉన్న ట్రాన్స్‌జెండర్లను ట్రంప్‌ పూర్తిగా తొలగించనున్నట్లు ది సండే టైమ్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రమాణస్వీకారం తర్వాత ట్రంప్‌ ట్రాన్స్‌జెండర్లను తొలగించే ఫైల్‌పై సంతకం చేయనున్నట్లు తెలిపింది. 

ఓ వైపు ఆర్మీలోకి కొత్తవారి నియామకం అంతగా లేని ప్రస్తుత సమయంలో ట్రంప్‌ ట్రాన్స్‌జెండర్లను తొలగించనుండడం చర్చనీయాంశమవుతోంది. ట్రాన్స్‌జెండర్లు ఆధునిక ఆర్మీ అవసరాలకు తగినట్లుగా సేవలందించడం లేదని ట్రంప్‌ నిర్ణయాన్ని సమర్థించే వారు చెబుతున్నారు. ఈ మేరకు వారు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

అయితే ఆర్మీ నుంచి తొలగించే ముందు ట్రాన్స్‌జెండర్లకు అన్ని గౌరవాలు ఇచ్చి పంపిస్తారని తెలుస్తోంది.ట్రంప్‌ తన తొలిటర్ములో కూడా ఇలాంటి వివాదాస్పద నిర్ణయమే తీసుకున్నారు. అయితే ట్రాన్స్ జెండర్లను ఆర్మీలోకి తీసుకోవడాన్ని మాత్రమే ట్రంప్‌ నిషేధించారు. అప్పటికే ఉన్నవారిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను బైడెన్‌ అధికారం చేపట్టిన తర్వాత రద్దు చేశారు. కాగా, నవంబర్‌ 5న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)