Breaking News

త్వరలో దక్షిణ కొరియాకు ట్రంప్‌.. జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం

Published on Sun, 09/07/2025 - 09:13

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్టోబర్‌లో జరిగే ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార వాణిజ్య మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణ కొరియాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని, అక్కడ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశంలో చర్చలు జరిపే అవకాశాలున్నాయిని, ట్రంప్‌ పరిపాలనా యంత్రాంగం తెలిపింది.
 

అక్టోబర్ చివరి నుండి నవంబర్ ప్రారంభం వరకూ జియోంగ్జు నగరంలో జరగనున్న ఈ శిఖరాగ్ర సమావేశానికి ట్రంప్ తో పాటు ఆయన అగ్ర సలహాదారులు కూడా హాజరుకానున్నారు. గత నెలలో ఈ ఇద్దరు  అధినేతల మధ్య ఫోనులో సంభాషణ జరిగింది. ఈ నేపధ్యంలో ట్రంప్‌, అతని భార్య మెలానియాలను జిన్‌పింగ్‌ చైనా సందర్శనకు ఆహ్వానించారు. అయితే ఈ పర్యటన అక్టోబర్‌లో జరగనున్నప్పటికీ తేదీలు ఇంకా ఖరారు కాలేదు. అలాగే ఈ విదేశీ పర్యటనను ముగించే ముందు ఇతర దేశాలు వెళతారా లేదా అనేది కూడా ఇంకా వెల్లడికాలేదు.

ట్రంప్ తన విదేశీ పర్యటన సందర్భంగా అమెరికాకు మరిన్ని పెట్టుబడులు తీసుకురావాలని యోచిస్తున్నారు. ట్రంప్‌ ఇటీవల సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సహా పలు దేశాలలో ప‍ర్యటించినప్పుడు విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు.మరోవైపు జిన్‌పింగ్‌ ఇటీవల కిమ్, వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీలకు ఆతిథ్యం ఇచ్చారు. దీనిని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు.
 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)