Breaking News

ట్రంప్‌ భయం.. ఈసారి భారీ ఫైన్లు, జైలు శిక్ష కూడా!

Published on Tue, 04/08/2025 - 20:55

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయాలు ప్రపంచదేశాలకు గుబులు పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్‌ ప్రభుత్వం.. తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. తక్షణమే స్వయంగా దేశం విడిచిపోవాలని.. లేకుంటే తీవ్ర చర్యలు తప్పవని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో.. 

అక్రమ వలసదారులు ముందుగా సెల్ఫ్‌ డిపోర్టేషన్‌ యాప్‌ ద్వారా పేరు రిజిస్టర్‌ చేసుకోవాలి. ఒకవేళ తుది ఆదేశాలు అందుకున్నాక కూడా దేశాన్ని వీడకుంటే.. రోజుకు 998 డాలర్లు(రూ.86వేల చొప్పున) జరిమానా విధిస్తారు.  ఆ జరిమానా చెల్లించకుంటే ఆస్తులను స్వాధీనం చేసుకుంటారు.  అప్పటికీ వీడకుంటే పర్యవసనాలు మరోలా ఉంటాయని డీహెచ్‌ఎస్‌ హెచ్చరించింది. 

తమంతట తాముగా అక్రమ వలసదారులు వెళ్లిపోవాలి. లేకుంటే.. అప్పటివరకు సంపాదించుకున్న డబ్బు జరిమానా రూపంలో కోల్పోవాల్సి వస్తుంది. వెయ్యితో మొదలై.. ఐదు వేల డాలర్ల దాకా జరిమానా విధించవచ్చు. జైలు శిక్ష ఎదుర్కొనడంతో పాటు భవిష్యత్తులో మళ్లీ అమెరికాకు వచ్చే అవకాశమూ కోల్పోతారు అని డీహెచ్‌ఎస్‌ హెచ్చరించింది. అయితే ఈ తరహా హెచ్చరికలను న్యాయస్థానాల్లో సవాల్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ట్రంప్‌ భయాల్లో భాగంగానే ఈ ప్రకటన చేసినట్లు స్పష్టమవుతోంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)