Breaking News

కొలంబియాపై ట్రంప్‌ కొరడా.. ఆ విమానాలు తిప్పి పంపినందుకే..

Published on Mon, 01/27/2025 - 07:15

వాషింగ్టన్‌:తన మాట వినని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చర్యలు మొదలు పెట్టారు. అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను తీసుకువెళ్లిన విమానాలను తిప్పి పంపినందుకు కొలంబియాపై కొరడా ఝలిపించారు. త్వరలో ఆ దేశంపై భారీ దిగుమతి సుంకాలతో పాటు ట్రావెల్‌ బ్యాన్‌ లాంటి ఆంక్షలను అమలు చేయనున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. 

ఈ మేరకు ట్రంప్‌ తన సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌సోషల్‌లో ఆదివారం(జనవరి26) ఒక పోస్టు చేశారు. ‘కొలంబియా అధ్యక్షుడు పెట్రో అమెరికా జాతీయ భద్రతను ప్రమాదంలో పడేశాడు.ఇందుకే కొలంబియాపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చా. కొలంబియా నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఇప్పటికిప్పుడు 25 శాతం టారిఫ్‌ విధిస్తాం. ఇది వారంలో 50 శాతానికి పెరుగుతుంది.

కొలంబియా నుంచి అమెరికాకు రావడంపై ట్రావెల్‌ బ్యాన్‌. వీటితో పాటు ఆర్థిక ఆంక్షలు ఉంటాయి’అని ట్రంప్‌ వెల్లడించారు. కాగా, ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులను వారి  దేశాలకు పంపేస్తున్న విషయం తెలిసిందే. అయితే వలసదారులను నేరస్తులుగా చిత్రీకరిస్తూ వారిని మిలిటరీ విమానాల్లో పంపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని కొలంబియా అధ్యక్షుడు పెట్రో ఎక్స్‌(ట్విటర్‌)లో తెలిపారు. 

తమ దేశానికి చెందిన వారికి గౌరవమిస్తూ పౌర విమానాల్లో పంపితే తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. గత వారం కూడా మెక్సికో కూడా కొలంబియా తరహాలోనే ట్రంప్‌ వలసదారులతో పంపిన మిలిటరీ విమానాలను తిప్పి పంపడం గమనార్హం. 

ఇదీ చదవండి: పద్ధతిగా వస్తేనే ప్రయాణం

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు