Breaking News

గాజా అమ్మకానికి లేదు

Published on Mon, 03/10/2025 - 06:03

ఎడిన్‌బర్గ్‌: గాజా స్ట్రిప్‌ను ఖాళీ చేయించి అందమైన పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతానన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై పాలస్తీనియన్లు ప్రతీకార చర్యలకు దిగారు. స్కాట్లాండ్‌లో ట్రంప్‌కు చెందిన టర్న్‌బెర్రీ గోల్ఫ్‌ రిసార్ట్‌ను ధ్వంసం చేశారు. శనివారం తెల్లవారుజామున నిరసనకారులు రిసార్ట్‌లోకి చొరబడ్డారు. గోల్ఫ్‌ హోల్స్‌ను నాశనం చేశారు. ఓపెన్‌ చాంపియ్‌íÙప్స్‌లో ఉపయోగించే వస్తువులు, ప్రదేశాలను పాడు చేశారు. అక్కడి పచ్చికబయళ్లపై ‘గాజా అమ్మకానికి లేదు’ అని తెల్లని పెయింట్‌తో రాశారు. 

రిసార్ట్‌ క్లబ్‌హౌస్‌ భవన గోడలపై ఎరుపు రంగు చల్లారు. ఇది తమ పనేనని ‘పాలస్తీనా యాక్షన్‌’ అనే సంస్థ ప్రకటించుకుంది. ‘‘గాజాపై ట్రంప్‌ వ్యాఖ్యలకు ప్రతీకారంగానే ఈ పని చేశాం. గాజాను తన సొంత ఆస్తిలా పరిగణిస్తామంటే ఒప్పుకోం. ఇది తెలియజేప్పేందుకు, ట్రంప్‌ ఆస్తికి భద్రత లేదని నిరూపించేందుకు రిసార్ట్‌పై దాడి చేశాం. గాజా స్ట్రిప్‌ను ఇజ్రాయెల్‌కు, అమెరికాకు వలసరాజ్యంగా మార్చే యత్నాలను అడ్డుకుంటాం’’ అని ప్రకటించింది. దాడిని పిల్లచేష్టగా రిసార్ట్‌ వర్గాలు కొట్టిపారేశాయి. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక గోల్ఫ్‌కోర్సుల్లో టర్న్‌బెర్రీ ఒకటి. ఇక్కడ నాలుగుసార్లు ఓపెన్‌ ఛాంపియన్‌íÙప్‌ జరిగింది. 2014లో ట్రంప్‌ కొనుగోలు చేసినప్పటి నుంచీ ఇక్కడ ఓపెన్‌ రొటేషన్‌ను అమలు చేయడం లేదు.  
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)