Breaking News

నిక్కీపై ట్రంప్‌ అనుచిత పోస్టులు

Published on Sat, 01/20/2024 - 07:31

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ జాతి వివక్ష వ్యాఖ్యలకు తెర తీశారు.అయోవా ప్రైమరీ బ్యాలెట్‌లో విజయం సాధించి ట్రంప్‌ ఇప్పటికే రిపబ్లికన్ల తరపున అధ్యక్ష పదవికి నామినేషన్‌ రేసులో ముందున్న విషయం తెలిసిందే. అయితే రిపబ్లికన్ల తరపున అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న ఇండియన్‌ అమెరికన్‌ నిక్కీ హాలేపై ట్రంప్‌ తాజాగా జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు.

నిక్కీపై ట్రూత్‌ సోషల్‌ ప్లాట్‌ఫాంలో అనుచిత పోస్టులు పెట్టారు. నిక్కీ పుట్టినప్పుడు ఆమె తల్లిదండ్రులకు అమెరికన్‌ పౌరసత్వం లేదని, అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి ఆమె అనర్హురాలని వ్యాఖ్యానించారు. ఇంతటితో ఆగకుండా ఆమె పేరులోని అక్షరాలను కూడా తప్పుగా రాశారు. అయితే ట్రంప్‌ వ్యాఖ్యలకు నిక్కీ ఎక్స్‌లో ధీటైన సమాధానమిచ్చారు.

‘ట్రంప్‌ గురించి నాకు బాగా తెలుసు అభద్రతాభావం,భయానికి గురైనపుడు ట్రంప్‌ వేరే వ్యక్తుల పేర్లు తీస్తారు. ఈ విషయంపై దృష్టి పెట్టి నా శక్తిని నేను వృథా చేసుకోను’అని హాలే పోస్టు చేశారు. గతంలో ఒబామా అధ్యక్ష పదవికి పోటీ చేసినపుడు కూడా ఆయన అమెరికన్‌ కాదని జాతి వివక్ష ప్రచారాన్ని ట్రంప్‌ విస్తృతంగా నిర్వహించారు. ఈ నెల 15న జరిగిన అయోవా రిపబ్లికన్‌ ప్రైమరీ బ్యాలెట్‌లో ట్రంప్‌కు 51 శాతం ఓట్లు రాగా రన్నరప్‌గా నిలిచిన డిశాంటిస్‌ ట్రంప్‌ దరిదాపుల్లో కూడా లేరు. నిక్కీ డిశాంటిస్‌ కన్నా వెనుకబడడం గమనార్హం. 

ఇదీచదవండి.. అణు డ్రోన్‌ను పరీక్షించిన ఉత్తర కొరియా

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)