Breaking News

ఎంపీ మహువా మొయిత్రా రహస్య వివాహం

Published on Thu, 06/05/2025 - 14:22

న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra) మరోమారు వార్తల్లో నిలిచారు. ఆమె మే మూడవ తేదీన రహస్య వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని టీఎంసీగానీ, మహువా మొయిత్రా గానీ వెల్లడించలేదు. ఈ విషయమై మీడియా ప్రముఖ టీఎంసీ ఎంపీని అడుగగా, ఆయన తనకు తెలియదని చెప్పారు.
 

అయితే వార్తా సంస్థ ‘ది టెలిగ్రాఫ్’ ప్రచురించిన ఫోటోలో మహువా మొయిత్రా బంగారు రంగు చీరలో మెరిసిపోతూ, భర్త పక్కన కనిపించారు. వారి వివాహం జర్మనీలో జరిగిన‌ట్టు తెలుస్తోంది. మహువా మొయిత్రా భర్త పేరు పినాకి మిశ్రా. ఆయన బిజు జనతాదళ్‌కు చెందిన నేత. పూరీ లోక్‌సభ సభ్యునిగా పనిచేశారు. 50 ఏళ్ల‌ మహువా మొయిత్రా గతంలో డానిష్ ఫైనాన్షియర్ లార్స్ బ్రోర్సన్‌ను వివాహం చేసుకున్నారు. తరువాత  విడాకులు తీసుకున్నారు. 

Trinamool: ఎంపీ రహస్య వివాహం

అనంతరం ఆమె ప్రముఖ న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్‌తో దాదాపు మూడేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. గతంలో బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దుబే.. మహువా డబ్బులు తీసుకొని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారని ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారంలో నిజానిజాలను నైతిక విలువల కమిటీ తేల్చిచెప్పింది. ఆ దరిమిలా మహువా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసి, సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇది 2023 డిసెంబర్‌లో జరిగింది. 

ఇది కూడా చదవండి: అన్నివైపుల నుంచి తోపులాట.. ప్రత్యక్ష సాక్షులు

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు