Breaking News

హెచ్-1బీ పాలసీ.. ట్రంప్‌ సీక్రెట్‌ అదేనా?

Published on Thu, 11/13/2025 - 11:18

విదేశీ కార్మికులు అవసరం తమ దేశానికి ఉందని ట్రంప్ ప్రకటన చేసి 24 గంటలైనా గడవక ముందే యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బీసెంట్ ట్రంప్ హెచ్-1బీ వీసా కొత్త విధానం ఉద్దేశ్యం బయటపెట్టారు. అమెరికా పౌరులను ఉన్నతమైన ఉద్యోగాలలో నియమించేందుకు విదేశాల నుంచి వలస కార్మికులు తాత్కాలికంగా అమెరికా వచ్చి ఆ దేశ పౌరులకు శిక్షణ  ఇచ్చి తిరిగి తమ దేశాలకు వెళ్లాల‍న్నారు. తద్వారా అమెరికన్స్ ఉన్నతమైన ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుందన్నారు. ట్రంప్ హెచ్-1బీ వీసా విధానం ఉద్దేశ్యం ఇదే అయిండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ దేశంలో తాత్కాలికంగా స్థిరపడిన విదేశీయులు, చదువుకోసం అమెరికాకెళ్లిన విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏ సమయంలో తమను దేశం వదిలి వెళ్లమంటారో అని కంగారుపడుతున్నారు. ఈనేపథ్యంలో ఇటీవల ఆ దేశం ఆమోందిచిన హెచ్-1బీ వీసా బిల్లు దానికి మరింత బలాన్ని చేకూర్చింది. హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును లక్షడాలర్లకు పెంచి ఆ దేశంలోకి వచ్చేవారి అవకాశాలను మరింత కఠినతరం చేశారు. అయితే అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసెంట్ ఫాక్స్ న్యూస్ కిచ్చిన ఇంటర్యూలో ట్రంప్ హెచ్-1బీ పాలసీ వ్యూహం బహిర్గతం చేశారు. 

అమెరికన్స్ గత 20-30 ఏళ్లుగా తయారీరంగంలోని ఉన్నతమైన ఉద్యోగాలలో లేరు, ఓడలు, సెమీకండక్టర్స్ నిర్మించలేదు. ఆ రంగాలలో వారికి తగినంత ప్రతిభ లేదు. కనుక విదేశాలనుంచి నైపుణ్యత కలిగిన కార్మికులు అమెరికాకు వచ్చి రెండు, ఐదు, ఏడు సంవత్సారాలపాటు అమెరికాలో ఉండి ఆ దేశ కార్మికులకు  శిక్షణ ఇచ్చి వెళ్లాలని.. ట్రంప్ నూతన పాలసీ విధానం ఉద్దేశ్యం ఇదే అయి ఉండవచ్చని బీసెంట్ అన్నారు.

అలా శిక్షణ పొందిన అనంతరం తిరిగి ఆ ఉద్యోగాలను టేకాఫ్ చేసుకుంటారని అన్నారు. వలస కార్మికులు ఆ దేశంలో ఉండడంతో ఒక్క అమెరికన్ ఉద్యోగం పొందలేకపోతున్నారని తెలిపారు. ట్రంప్ ప్రభుత్వం అమెరికన్ల క్షేమం కొరకే పనిచేస్తుందని లక్ష డాలర్లు లోపల ఆదాయం ఉన్న కుటుంబాలకు పన్నులో రెండువేల డాలర్లు రాయితీ ఇచ్చే అంశం చర్చిస్తున్నామన్నారు. కాగా నిన్న ఫాక్స్ న్యూస్ కిచ్చిన ఇంటర్వూలో ట్రంప్ అమెరికన్లకు మ్యానుఫాక్చరింగ్ సెక్టార్ లో తగినంత నైపుణ్యత లేదని ఆ రంగాలలో విదేశీయులను నియమించుకునే అవసరముందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.   

Videos

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

Photos

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)