Breaking News

ఇజ్రాయెల్‌ జైళ్లలో ఖైదీలపై కుక్కలను ఉసిగొల్పి..

Published on Wed, 06/10/2026 - 12:17

జెరూసలెం: అక్టోబర్ 2023 హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్‌ తన ఆధీనంలోకి తీసుకున్న పాలస్తీనా ఖైదీలపై జరుపుతున్న అమానుష విచారణ పర్వం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఇజ్రాయెల్‌ జైళ్లు పాలస్తీనియన్లకు నరకంగా మారాయంటూ అల్ జజీరా దర్యాప్తులో వెల్లడైన బాధితుల వాంగ్మూలాలు  కలకలం రేపుతున్నాయి. తమకు హమాస్ దాడులతో ఎలాంటి సంబంధం లేదని మొత్తుకుంటున్నా వినకుండా, ఖైదీలను జంతువుల కంటే హీనంగా చూస్తూ, లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నారు.

కుక్కలతో లైంగిక దాడి.. సైనికుల పైశాచిక నవ్వులు
ఒక మాజీ ఖైదీ అందించిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 2024లో రంజాన్ ముగిసే సమయంలో సుమారు 12 మంది సైనికులు తమపైకి శిక్షణ పొందిన కుక్కలను వదిలారు. బట్టలు విప్పేసి లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, సైనికుల ఆదేశాల మేరకు కుక్కలను కూడా ఈ అకృత్యానికి ఉపయోగించారని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. తాము  కేకలు వేస్తున్నా, సైనికులు నవ్వుకుంటూ ఆ దృశ్యాలను మొబైల్‌లో రికార్డ్ చేశారని ఆ గాజా నివాసి పేర్కొన్నాడు. ఖైదీల పేర్లను తొలగించి నంబర్లను కేటాయించారని, బోర్లా పడుకోబెట్టి కాళ్లు, చేతులు కట్టేసి, వారిపై కుక్కలను నడిపించారని వెల్లడైంది.

మహిళా అధికారుల అకృత్యాలు.. బూట్లతో తొక్కుతూ అరాచకం
గాజాకు చెందిన మరో కార్మికుడు తనకు ఎదురైన నరకాన్ని వివరిస్తూ.. ఇజ్రాయెల్ జైళ్లలో మహిళా అధికారులు సైతం కృత్రిమ వస్తువులతో తమపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. చేతులను వెనక్కి విరిచి ఇనుప సంకెళ్లు వేసి, బట్టలు ఊడదీసి హింసించారని తెలిపాడు. సైనికులు తన వీపుపై, మెడపై బూట్లతో తొక్కి పట్టి ఉంచగా, చుట్టూ ఉన్న మిగతా సైనికులు చప్పట్లు కొడుతూ వీడియోలు తీశారని వివరించాడు. తాము ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడి దాడులు చేశామనే కోపంతోనే ఈ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఇజ్రాయెల్ గార్డులు అన్నారని బాధితుడు పేర్కొన్నాడు.

తప్పేం కాదు: ఇజ్రాయెల్ నేతల సమర్థన
గతంలో దక్షిణ ఇజ్రాయెల్ నిర్బంధ కేంద్రంలో ఒక ఖైదీపై జరిగిన లైంగిక దాడి వీడియో లీకై తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై కొందరు ఐడీఎఫ్ సైనికులను అరెస్ట్ చేయగా, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పార్టీకి చెందిన ఎంపీ హనోచ్ మిల్విడ్స్కీ వింత వాదనను వినిపించారు. ఖైదీలపై ఇటువంటి చర్యలు చట్టబద్ధమేనా అని ప్రశ్నించగా, ‘అతడు హమాస్ ఉగ్రవాది అయితే.. ఏం చేసినా చట్టబద్ధమే.. ఏదైనా చేయవచ్చు’ అని సమర్థించారు. దేశ జాతీయ భద్రతా మంత్రి ఇతమార్ బెన్ గ్విర్ సైతం ఆ సైనికులకు  మద్దతు ప్రకటించడం గమనార్హం.

ఇది కూడా చదవండి: జోహన్నెస్‌బర్గ్‌లో మారణహోమం.. 12 మంది మృతి

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)