Breaking News

అమెరికాలో టిక్‌టాక్‌ సేఫ్‌ 

Published on Sat, 01/24/2026 - 06:17

వాషింగ్టన్‌:  అమెరికాలో నిషేధం హెచ్చరికల నుంచి తప్పించుకోవడానికి టిక్‌టాక్‌ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా సంస్థలతో చేతులు కలిపింది. ఈ మేరకు ఒప్పందాలపై తాజాగా సంతకాలు జరిగాయి. అమెరికాలో ఒరాకిల్, సిల్వర్‌ లేక్, ఎంజీఎక్స్‌ సంస్థలతో టిక్‌టాక్‌ కంపెనీ కలిసి పనిచేయనుంది. కొత్తగా టిక్‌టాక్‌ యూఎస్‌ జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు కానుంది. ఒరాకిల్, సిల్వర్‌ లేక్, ఎంజీఎక్స్‌కు 15 శాతం చొప్పున వాటా ఉంటుంది. 

డెల్‌ టెక్నాలజీస్, బైట్‌డ్యాన్స్‌ సంస్థలు కూడా ఇందులో పెట్టుబడులు పెడుతున్నాయి. టిక్‌టాక్‌ ప్రసుతం చైనా కంపెనీ యాజమాన్యంలో ఉంది. అమెరికాలో 20 కోట్ల మందికిపైగా యూజర్లు ఉన్నారు. వీడియోలు సృష్టించి, షేర్‌ చేసుకుంటున్నారు. తమ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని టిక్‌టాక్‌ కంపెనీ చోరీచేసి, చైనాకు చేరవేస్తోందని అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోపిస్తున్నారు. చైనా యాజమాన్యం కింద కొనసాగితే తమ దేశంలో టిక్‌టాక్‌ను నిషేధిస్తామని ఆయన ఇప్పటికే హెచ్చరించారు.

 దేశ భద్రత కోసమే నిషేధించక తప్పదని పేర్కొన్నారు. అమెరికా సంస్థల పరిధిలో పనిచేస్తే అభ్యంతరం లేదని ప్రకటించారు. 20 కోట్ల మంది యూజర్లను వదులుకోవడం ఇష్టంలేని టిక్‌టాక్‌ యాజమాన్యం అమెరికా కంపెనీలతో జతకట్టింది. ఏడాదికాలంగా జరుగుతున్న చర్చలు పూర్తయ్యాయి. అమెరికా సంస్థలతో ఎట్టకేలకు ఒప్పందానికి వచి్చంది. ఇకపై నూతన జాయింట్‌ వెంచర్‌ ఆధ్వర్యంలోనే అమెరికాలో టిక్‌టాక్‌ కార్యకలాపాలు కొనసాగుతాయి. 

ఇందులో ఏడుగురు సభ్యులు ఉంటారు. మెజార్టీ సభ్యులు అమెరికన్లే ఉంటారనడంలో సందేహం లేదు. సమగ్ర డేటా రక్షణలు, ఆధునిక కంటెంట్, సాఫ్ట్‌వేర్‌తో జాతీయ భద్రతకు కట్టుబడి ఉంటూ యూజర్లకు సేవలు అందించనున్నట్లు టిక్‌టాక్‌ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం తప్పినట్లయ్యింది. సేవలు యథావిధిగా కొనసాగుతాయి.  

ట్రంప్‌ ప్రశంసలు  
అమెరికా కంపెనీలతో టిక్‌టాక్‌ కుదర్చుకున్న ఒప్పందాన్ని అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసించారు. చైనా అధినేత షీ జిన్‌పింగ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు. జిన్‌పింగ్‌ తమతో కలిసి పనిచేస్తుండడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో టిక్‌టాక్‌ యూజర్లకు తాను గుర్తుండిపోతానని ఉద్ఘాటించారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)