Breaking News

ఇజ్రాయెల్‌ దాడులు.. ముగ్గురు జర్నలిస్టులు మృతి

Published on Sat, 10/26/2024 - 06:02

బీరుట్‌/ఖాన్‌ యూనిస్‌: గాజాతోపాటు లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్‌లోని హస్బయా ప్రాంతంపై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వీరిని బీరుట్‌ కేంద్రంగా పనిచేసేత అరబ్‌ టీవీ అల్‌ మయాదీన్‌ కెమెరామ్యాన్‌ ఘస్సన్‌ నాజర్, టెక్నీషియన్‌ మహ్మద్‌ రిడా, హెజ్‌బొల్లా గ్రూపునకు చెందిన అల్‌ మనార్‌ టీవీ కెమెరామ్యాన్‌ విస్సమ్‌ కస్సిమ్‌గా గుర్తించారు. 

ఘటన సమయంలో ఆ భవనంలో ఏడు వేర్వేరు మీడియా సంస్థలకు చెందిన 18 మంది జర్నలిస్టులు ఉన్నారని లెబనాన్‌ సమాచార మంత్రి జియాద్‌ మకరీ చెప్పారు. ఇజ్రాయెల్‌ చర్యను  ప్రణాళిక ప్రకారం చేపట్టిన హత్యాకాండగా అభివర్ణించారు. కుప్ప కూలిన భవనం ప్రాంగణంలో ప్రెస్‌ అనే స్టిక్కర్‌తో ధ్వంసమైన వాహనాలున్న వీడియోను అసోసియేటెడ్‌ ప్రెస్‌ విడుదల చేసింది. 

ఆ సమయంలో తామంతా విశ్రాంతి తీసుకుంటున్నామని దాడి నుంచి సురక్షితంగా బయటపడిన అల్‌ జజీరా ఇంగ్లిష్‌ చానెల్‌ కరస్పాండెంట్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ చెప్పారు. అయితే, ఉద్దేశపూర్వకంగా తాము దాడి చేయలేదని ఇజ్రాయెల్‌ మిలటరీ పేర్కొంది. గాజాపై యుద్ధం మొదలయ్యాక 128 మంది జర్నలిస్టులు విధుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయారని జర్నలిస్టుల రక్షణ కమిటీ తెలిపింది. మరోవైపు 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్‌ ఆరోగ్య శాఖ తెలిపింది.

ఒకే కుటుంబంలోని 36 మంది మృతి
గాజాలోని ఖాన్‌యూనిస్‌ నగరంపై గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఇజ్రాయెల్‌ ఆర్మీ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో మొత్తం 38 మంది చనిపోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది చిన్నారులు సహా 36 మంది ఉన్నారని పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)