Breaking News

90 ఏళ్ల తర్వాత.. గడగడలాడించిన చిడో తుపాన్

Published on Mon, 12/16/2024 - 07:59

పారిస్‌ : చిడో తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. హిందు మహాసముద్రంలో ఏర్పడిన చిడో తుపాను తీవ్రతతో మయోట్ ద్వీపంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులైనట్లు  ఫ్రాన్స్ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

తుపాను కారణంగా గంటకు దాదాపు 220 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు ద్వీపాన్ని అతలా కుతలం చేశాయి. ఫలితంగా తాత్కాలిక గృహాలు, ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రులు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ గాలుల ప్రభావం వల్ల ప్రాణ,ఆస్తినష్టం భారీ ఎత్తున జరిగిందని అన్నారు.

గత 90 ఏళ్లలో మయోట్‌ను తాకిన అత్యంత భయంకరమైన తుపాను ఇదేనని అధికారులు చెప్పారు. ఫ్రాన్స్‌ ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఆదివారం ఉదయం చిడో తుఫాన్‌ ప్రారంభంలో 11మంది మరణించగా, 250 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు ధృవీకరించింది. అయితే మరణాలు, గాయపడ్డ వారి సంఖ్య సోమవారం ఉదయం నాటికి గణనీయంగా పెరిగినట్లు అంచనా వేసింది.  

 శనివారం తుఫాను కారణంగా మయోట్‌ ద్వీపం పూర్తిగా దెబ్బ తిన్నదని, జరిగిన ప్రాణనష్టం, ఆస్తినష్టం ఎంతనేది అంచనా వేయడం కష్టంగా ఉందన్నారు. ఫ్రాన్స్ రెస్క్యూ టీమ్‌లు.. మెడిసిన్‌, ఆహారంతో పాటు ఇతర నిత్యవసర వస్తువుల్ని ద్వీపానికి తరలించినట్లు మయోట్‌ ద్వీప ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)