Breaking News

ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు

Published on Sat, 01/03/2026 - 07:56

మనూళ్లో తాగిన మైకంలో వేరే వాళ్ల చెప్పులు వేసుకుని వెళ్లేవారిని చూస్తుంటాం, అమెరికాలో ఒక ఘరానా దొంగ మందు మత్తులో మ్యూజిక్‌ దుకాణంలోకి దూరాడు. రెండు ఖరీదైన మ్యాండోలిన్లను లేపేశాడు. సీన్‌ కట్‌ చేస్తే.. కొన్ని రోజుల తర్వాత దొంగగారిలో జ్ఞానోదయం కలిగింది.  

అసలేం జరిగిందంటే..  
న్యూజెర్సీలోని ఒక పాతకాలపు మ్యూజిక్‌ దుకాణంలోకి డిసెంబర్‌ 22న ఒక దొంగ ప్రవేశించాడు. సుమారు రూ.7 లక్షల రూపాయల విలువైన రెండు మ్యాండోలిన్లను గుట్టుచప్పుడు కాకుండా తన కోటు లోపల దాచేసి చెక్కేశాడు.

మైకం దిగాక పశ్చాత్తాపం 
పాపం, ఆ దొంగగారికి మత్తు దిగాక తాను ఏం చేశానో తెలిసి గుండె ఝల్లుమంది! వెంటనే ఆ రెండు వాయిద్యాలను రెండు క్యారీ బ్యాగుల్లో సర్దుకుని, నేరుగా మ్యూజిక్‌ దుకా ణం గుమ్మం ముందు పెట్టేసి పరుగు లంఘించుకున్నాడు. అంతేనా.. దాంతో పాటు క్షమాపణ లేఖ కూడా రాసి పెట్టాడు. అందులో మేటర్‌ చూసి షాపు యజమా ని బజ్జీ లెవిన్‌ బుర్ర పాడైపోయింది. ‘అయ్యా క్షమించండి! ఆ రోజు ఫుల్లుగా తాగి ఉన్నాను. అందుకే ఇలా జరిగింది. మెర్రీ క్రిస్మస్‌! మీరు చాలా మంచోళ్ళు సార్‌!’.. ఇదీ లేఖ సారాంశం.

ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు 
అది చూసిన యజమాని బజ్జీ లెవిన్, ‘వీడెవడ్రా బాబూ ఇంత వెరైటీగా ఉన్నాడు’.. అని ఆశ్చర్యపోయాడు. వస్తువులు పెట్టేసి దొంగ పరిగెడుతుంటే, యజమాని కూడా వెనకాలే పరుగు అందుకున్నాడు. కానీ ఆ దొంగగారు ఉసేన్‌ బోల్ట్‌ కంటే వేగంగా మాయమైపోయారు. ‘నా జీవితంలో ఇలాంటి వింత ఎప్పుడూ చూడలేదు బాబోయ్‌’.. అని యజమాని నెత్తీనోరు కొట్టుకుంటున్నాడు.  

చిలిపి దొంగ కోసం గాలింపు 
చివరికి 911కి ఫోన్‌ చేస్తే, పోలీసులు ఇప్పుడు ఆ మందుబాబు కోసం గాలిస్తున్నారు. మందులో ఉన్నప్పుడు మ్యాండోలిన్‌ గుర్తొచ్చింది.. మత్తు దిగాక మాత్రం మనస్సాక్షి గుర్తొచి్చంది’.. అని జనం నవ్వుకుంటున్నారు. పాపం.. మందు కొట్టి దొంగతనం చేసినా, ’మెర్రీ క్రిస్మస్‌’ చెప్పడం మాత్రం మర్చి పోలేదు మన చిలిపి దొంగ. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)