Breaking News

టన్నుల కొద్దీ బంగారమున్న గ్రహశకలం ఏది? భూమి మీదకు తెస్తే ఏమవుతుంది?

Published on Thu, 10/12/2023 - 08:56

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(నాసా) తాజాగా అంగారక గ్రహం- బృహస్పతి మధ్యనున్న 16 సైక్‌ అనే ఒక భారీ లోహ గ్రహశకలాన్ని చేరుకునేందుకు ఉద్దేశించిన మిషన్‌పై పని చేస్తోంది. ఈ లోహ గ్రహశకలంలో 10,000 క్వాడ్రిలియన్ డాలర్ల (ఒక క్వాడ్రిలియన్.. రూ.7,44,045) విలువైన ఇనుము, నికెల్, బంగారం ఉన్నట్లు అంచనా. 

నాసా తెలిపిన వివరాల ప్రకారం బంగాళాదుంప ఆకారంలో ఉన్న ఈ గ్రహశకలం సగటు వ్యాసం సుమారు 140 మైళ్లు (226 కిలోమీటర్లు). భూమికున్న చంద్రుని వ్యాసంలో దాదాపు 16వ వంతు. లేదా హైదరాబాద్‌ - గుంటూరు మధ్య దూరం. ఈ గ్రహశకలంపై ప్రస్తుతం ఉన్న బంగారం విలువ బిలియన్ డాలర్ల మేరకు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

సాధారణంగా పలు గ్రహశకలాలు రాతి లేదా మంచుతో నిండి ఉంటాయి. కానీ 16 సైక్‌ను మృత గ్రహానికి చెందిన ఓపెన్ మెటాలిక్ హార్ట్‌గా భావిస్తున్నారు. ఈ గ్రహశకలంపై లభ్యమయ్యే బంగారాన్ని భూమిపైకి తెచ్చి, అందరికీ సమానంగా పంచగలిగితే భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ బిలియనీర్లు కావచ్చు. ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త అన్నీబేల్ డి గ్యాస్పరిస్ 1852 మార్చి 17న ఈ గ్రహశకలాన్ని కనుగొన్నారు. గ్రీకు దేవత అయిన సైకీ పేరు మీద ఈ గ్రహశకలానికి పేరు పెట్టారు. 

ఆ గ్రీకు దేవత ఒక చేపగా జన్మించింది. ప్రేమ దేవుడైన ఎరోస్ (రోమన్ మన్మథుడు)ను వివాహం చేసుకుంది. సైక్‌ సూర్యుని చుట్టూ ఒక కక్ష్యను పూర్తి చేయడానికి సుమారు ఐదు భూమి సంవత్సరాలు పడుతుంది. నాసా ఈ సైక్ స్పేస్‌క్రాఫ్ట్ పరిశోధనను 2022 ఆగష్టులో ప్రారంభించింది. ఈ నేపధ్యంలో 2026లో ఈ గ్రహశకలాన్ని చేరుకోవచ్చని భావించారు. అయితే  ఏవో కారణాలతో ఈ మిషన్‌ను 2023(ఈ ఏడాది)కి వాయిదా వేశారు. మరి ఈ మిషన్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: పార్లమెంట్‌ ద్వారాలకు జంతువుల పేర్లెందుకు? గజ ద్వారం దేనికి సూచిక?

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)