Breaking News

ప్రపంచ చరిత్రలో అత్యంత క్రూరమైన శిక్ష.. ఏనుగును క్రేన్‌కు బిగించి..

Published on Wed, 06/28/2023 - 11:09

ప్రపంచంలోని పలు దేశాల్లో క్రూరమైన రాజుల పాలన సాగిందనే విషయం మనం చరిత్రలో చూసివుంటాం. వారు విధించే శిక్షలు వెన్నులో వణుకుపుట్టించేవని కూడా వినివుంటాం. అయితే అంతకన్నా అత్యంత క్రూరమైన యజమాని గురించి, అతను విధించిన హేయమైన శిక్ష గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏనుగును క్రేన్‌కు బిగించి, అందరి ముందు దానికి శిక్ష విధించాడంటే.. అతను ఎంత క్రూరమైనవాడో ఇట్టే గ్రహించవచ్చు.

ఏనుగు ఏం తప్పు చేసిందని..
అత్యంత సాధు జంతువుగా పేరొందిన ఏనుగుకు శిక్ష విధించాడంటే అతని నిర్దయ ఏపాటితో ఇట్టే అ‍ర్థమవుతుంది. అది 1816, సెప్టెంబరు 13.. అమెరికాలో అత్యంత హేయంగా ఒక ఏనుగును క్రేన్‌కు వేలాడదీసి మరణశిక్ష విధించారు. ఆ ఏనుగు పేరు మేరీ. అది తన మావటివాడిని కాలితో తొక్కి చంపేసిందని దానికి ఇంత దారుణమైన శిక్ష విధించాడు. 

చరిత్ర అందించిన స​మాచారం ప్రకారం  ఆ ఏనుగు ఆకలితో అల్లాడిపోతూ అదుపుతప్పింది. దానిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన మావటివాడు దాని చెవిపై గట్టిగా కొట్టాడు. అంతే.. ఆ ఏనుగు కోపంతో.. ఒక్కసారిగా తన పాదంతో ఆ మావటివాడిని తొక్కి చంపేసింది. ఆ ఏనుగు ఒక సర్కస్‌లో పనిచేస్తుండేది. మావటివాడిని తొక్కి చంపేయడంతో ఆ ఏనుగుపై స్థానికులకు ఆగ్రహం కలిగింది.

క్రేన్‌కు వేలాడదీసి..
జనాగ్రహాన్ని చూసిన సర్కస్‌ యజమాని అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆ ఏనుగుకు మరణశిక్ష విధించాలనుకున్నాడు. దానిని చంపివేస్తున్నట్లు వెంటనే ప్రకటించాడు. ఇందుకోసం 100 టన్నుల బరువు ఎత్తగల ఒక ప్రత్యేకమైన క్రేన్‌ తెప్పించాడు. ఏనుగు మెడను తాడుతో కట్టేందుకు ఒక ప్రత్యేకమైన తాడును కూడా తెప్పించాడు. క్రేన్‌ సాయంతో ఏనుగు మెడకు ఉరితాడు బిగించి, దానికి బహిరంగంగా జనసమూహం మధ్యలో మరణశిక్ష విధించాడు. 

ఇది కూడా చదవండి: గుడ్లను యూరిన్‌లో ఉడికించి, ఉప్పుకారం జల్లి..

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)