Breaking News

థాయిలాండ్‌ ప్రధానికి ఉద్వాసన

Published on Thu, 08/15/2024 - 05:30

బ్యాంకాక్‌: అవినీతి మరక అంటుకున్న వ్యక్తిని తిరిగి మంత్రివర్గంలోకి తీసుకుని నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ థాయిలాండ్‌ ప్రధాన మంత్రి స్రెట్టా థావీసిన్‌ను అక్కడి రాజ్యాంగ ధర్మాసనం ప్రధాని పదవి నుంచి తొలగించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీని రద్దుచేయాలంటూ ఒక కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడిన వారం రోజులకే ఇలా ప్రధాన మంత్రి పదవి ఊడిపోవడం గమనార్హం. 

‘‘ నన్ను క్షమించండి. నన్ను కోర్టు అనైతిక ప్రధానిగా భావించిందిగానీ నేను అలాంటి వ్యక్తినికాదు. ఏదేమైనా కోర్టు తీర్పును శిరసావహిస్తా’ అని తీర్పు తర్వాత ప్రధాని స్రెట్టా వ్యాఖ్యానించారు. స్రెట్టాకు వ్యతిరేకంగా 5:4 మెజారిటీతో బుధవారం కోర్టు తీర్పు వెలువరిచింది. 

తక్షణం తమ ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది. ఏప్రిల్‌లో కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా పిచిత్‌ చుయెన్‌బన్‌ను మంత్రిగా ఎంపికచేశారు. అయితే 2008లో ఆయన ఒక జడ్జికి 55వేల అమెరికన్‌ డాలర్లు లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టయి ఆరు నెలలపాటు జైలు జీవితం గడిపి విడుదలయ్యారు. అవినీతి నేతకు మళ్లీ మంత్రి పదవి కట్టబెట్టారంటూ ప్రధానిపై విమర్శలు వెల్లువెత్తడం తెల్సిందే. 

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)