Breaking News

థాయ్‌లాండ్‌లోనూ అయోధ్య.. ఇక్కడి రాజే రాముని అవతారం!

Published on Thu, 11/30/2023 - 08:25

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య మాదిరిగానే థాయ్‌లాండ్‌లో కూడా అయోధ్య ఉంది. ఈ ప్రదేశానికి అయోధ్య అని పేరు పెట్టడమే కాకుండా ఇక్కడి రాజులను రాముని అవతారంగా భావిస్తారు. థాయ్‌లాండ్‌లోని ‘అయుతయ’ నగరానికి ప్రాచీన భారతీయ నగరమైన అయోధ్య పేరు పెట్టారు. ఇక్కడి రాజవంశంలోని  ప్రతి రాజును రాముని అవతారంగా భావిస్తారు.

థాయ్‌లాండ్‌ ‘అయోధ్య’కు సంబంధించిన వివరాలను 22 ఏళ్లుగా బోధనావృత్తి సాగిస్తున్న డాక్టర్ సురేష్ పాల్ గిరి వివరించారు. తాను థాయ్‌లాండ్‌లోని మతపరమైన విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. థాయ్‌లాండ్‌ ఒకప్పుడు భారతదేశంలో భాగమని అన్నారు. మొదట్లో హిందూ ప్రాబల్యం ఉన్న ఈ దేశంలో కాలక్రమేణా బౌద్ధం ప్రవేశించి, దానిలోని అంశాలు హిందూమతంతో కలిసిపోయాయన్నారు.

భారతదేశంలోని అయోధ్య , థాయ్‌లాండ్‌లోని అయోధ్య మధ్య గల పోలికల గురించి సురేష్‌ తెలియజేస్తూ.. భారత పూర్వీకుల సంప్రదాయాలు మరచిపోలేనివి అని అన్నారు.  ఇప్పటికీ థాయ్‌లాండ్ ప్రజలు శ్రీరాముని  పూజిస్తారన్నారు. ఇక్కడి రాజు ఈ నగరంలో కొన్ని హిందూ దేవాలయాలను కూడా నిర్మించారని తెలిపారు. ‘అయుతయ’కు 35 కిలోమీటర్ల దూరంలో విష్ణువు, బ్రహ్మ, శంకరుని ఆలయం ఉంది. ‘అయుతయ’ రాజు 'రామతిబోధి' (రాముడు) అనే బిరుదును కలిగి ఉండేవాడు. అయోధ్య రామాయణంలో శ్రీరాముని రాజధాని వర్ణనలో ‘అయుతయ’  పేరు కూడా కనిపిస్తుంది. అయుతయను 1767లో బర్మీస్ దళాలు దోచుకుని  ఆ ప్రాంతాన్ని నాశనం చేశాయి.
ఇది కూడా చదవండి: ‘ఆ భారతీయుడే న్యూయార్క్‌లో హత్యకు కుట్రపన్నాడు’
 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)