Breaking News

థాయ్‌లాండ్‌ దాడులు

Published on Mon, 12/08/2025 - 08:57

బ్యాంకాక్‌: మీరే మొదట కాల్పుల విరమణను ఉల్లంఘించారంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటూనే దక్షిణాసియా దేశాలు థాయ్‌లాండ్, కాంబోడియా మళ్లీ దాడుల్లో మునిగిపోయాయి. గత జూలైలో పరస్పర దాడులతో సరిహద్దు ప్రాంతవాసుల కంటి మీద కనుకులేకుండా చేసిన ఇరుదేశాలు మళ్లీ కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. యుద్ధానికి ఆజ్యం పోసేలా కాంబోడియా సరిహద్దు ప్రాంతాలపై థాయ్‌లాండ్‌ సోమవారం వైమానిక దాడులు చేసింది. 

ఈ ఘటనలో నలుగురు కాంబోడియా పౌరులు చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మరో 8 మంది గాయపడ్డారు. కాంబోడియా జరిపిన ప్రతిదాడిలో ఒక థాయ్‌లాండ్‌ జవాను చనిపోయాడు. దాడుల ధాటికి సరిహద్దు వెంట ఉన్న గ్రామాల నుంచి సోమవారం వేలాది మంది స్థానికులు బతుకుజీవుడా అంటూ తమ స్వస్థలాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. సరిహద్దు వెంట పలు గ్రామాల్లో ప్రజలను ఇప్పటికే ఖాళీ చేయించామని కాంబోడియా సమాచార శాఖ        మంత్రి నేథ్‌ ఫియాక్‌త్రా చెప్పారు. ‘‘ హింసను థాయ్‌లాండ్‌ ఎప్పుడూ కోరుకోదు. 

యుద్ధాన్నిగానీ సైనికచర్యనుగానీ థాయ్‌లాండ్‌ తనంతట తానుగా మొదలుపెట్టబోదు. కానీ దేశ ప్రజల భద్రతను పరిరక్షించేందుకు అవసరమైతే మరిన్ని దాడులు చేస్తాం. మా దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదు’’ అని థాయ్‌లాండ్‌ ప్రధానమంత్రి అనుతిన్‌ చార్న్‌విరకూల్‌ చెప్పారు. ‘‘ మా దేశ సార్వభౌమత్వానికి ఇక ఎలాంటి ముప్పు లేదని తేలేదాకా దాడులు చేస్తూనే ఉంటాం’’ అని థాయ్‌లాండ్‌ విదేశాంగ శాఖ అధికారులు చెప్పారు. జూలైలో కాంబోడియా, థాయ్‌లాండ్‌ ఘర్షణల్లో 48 మంది చనిపోయారు. 3,00,000 మంది తాత్కాలికంగా వేరే ప్రాంతాలకు తరలిపోయారు.

ఇది కూడా చదవండి: 600 అడుగుల లోయలో పడిన కారు.. ఆరుగురు మృతి!

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)