Breaking News

ఉన్నట్టుండి తుపాకీ కాల్పుల మోత.. టెక్సాస్‌ మాల్‌లో ఏం జరిగిందంటే..

Published on Sun, 07/02/2023 - 07:42

అది 2023, మే 6.. అమెరికాలోని టెక్సాస్‌ స్టేట్‌లోని ఎలన్‌ పట్టణంలోగల ఒక షాపింగ్‌ మాల్‌లో ఉన్నట్టుండి కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో కాల్పులకు పాల్పడిన వ్యక్తితో పాటు మొత్తం 9 మంది మృతి చెందారు. వీరిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. ఏడుగురు గాయపడ్డారు. హంతకుడిని పోలీసులు మట్టుబెట్టారు.

ప్రత్యక్ష సాక్షి చెప్పిందిదే..
ఈ ఘటనకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలోను, ఫొటోలలోను రక్తపుమడుగులో నేలపై పడి ఆర్తనాదాలు చేస్తున్న బాధితులు, మృతులు దయనీయ స్థితిలో కనిపించారు. వారి మధ్య హంతకుడు కూడా ఉన్నాడు. అతని మృతదేహం వద్ద ఒక తుపాకీ కూడా ఉంది. ఈ ఘటనను చూసిన ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. అతను షాపింగ్‌ చేస్తుండగా ఉన్నట్టుండి తుపాకీ కాల్పుల మోత వినిపించింది. వెంటనే అతను ఒక పక్కకు వెళ్లి దాక్కున్నాడు. ఇంతలో పోలీసులు షాపింగ్‌ మాల్‌లోని వారిని బయటకు వెళ్లిపోవాలని చెప్పడంతో తాను కూడా బయటకు వెళ్లిపోయానన్నారు. అక్కడ తనకు చాలా మృతదేహాలు కనిపించాయన్నారు. 

తెలుగు యువతి దుర్మరణం
ఈ ఘటనలో ఒక తెలుగు యువతి దుర్మరణం పాలయ్యింది. హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల ఐశ్వర్య టెక్సాస్‌ కాల్పులలో మృతి చెందింది. ఆమె రంగారెడ్డి జిల్లా జడ్జి తాతికొండ నర్సరెడ్డి కుమార్తె. ఐశ్వర్య అమెరికాలోని ఒక కంపెనీలో ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా పనిచేస్తోంది.

అలెర్ట్‌ అయిన పోలీసులు
ఈ కాల్పుల ఘటన జరిగిన వెంటనే పోలీసులు అలెర్ట్‌ అయ్యారు. మారణాయుధంతో దాడులకు తెగబడిన నరరూపరాక్షసుడిని మట్టుబెట్టారు. అతనొక్కడే ఈ కాల్పులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. దుండగుడిని 33 ఏళ్ల మారిసియో గార్సియాగా గుర్తించారు. ఈ ఘటనకు కారణమేమిటన్నదానిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. 

4 నెలల్లో 198 కాల్పుల ఘటనలు
గన్‌ కల్చర్‌ ఆర్కైవ్‌ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది అమెరికాలో ఇప్పటివరకూ మొత్తం 198 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 30న జరిగిన మాస్‌ షూటింగ్‌లో ఆగంతకుడు ఐదుగురిని తుపాకీ కాల్పులకు బలితీసుకున్నాడు. ఈ ఘటనలో 9 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. 

33 కోట్ల జనాభాలో 40 కోట్ల తుపాకులు
అమెరికా స్వాతంత్ర్యం సాధించి 231 ఏళ్ల దాటినా గన్‌ కల్చర్‌ అంతంకాలేదు. దీని వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తుంటాయి. 2019కి సంబంధించిన ఒక రిపోర్టు ప్రకారం అమెరికాలో 63 వేల మంది గన్‌కల్చర్‌ డీలర్లు ఉన్నారు. వీరు అదే ఏడాది ఆమెరికా పౌరులకు 83 వేల కోట్ల రూపాయల విలువైన తుపాకులను విక్రయించారు. ప్రపంచంలోని మొత్తం 85.7 కోట్ల సివిలియన్‌ గన్‌లలో ఒక్క అమెరికాలోనే 39.3 కోట్లు ఉన్నాయి. ప్రపంచ జనాభాలో అమెరికా జనాభా 5 శాతం. అయితే ‍ప్రపంచం మొత​ంలో గల సివిలియన్‌ గన్‌లలో 46 శాతం కేవలం అమెరికాలోనే ఉండటం విశేషం. 

ఇది కూడా చదవండి: ఫ్రాన్స్ అల్లర్లలో కొత్త కోణం.. అల్లరి మూకల చేతుల్లో ఆధునాతన ఆయుధాలు

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)